ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @7AM - top news in Telugu

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 10, 2022, 7:01 AM IST

  • యూపీ మహాసంగ్రామం

UP Election 2022 Live Updates: ఉత్తర్​ప్రదేశ్​లో తొలి విడత పోలింగ్​కు రంగం సిద్ధమైంది. యూపీ మహాసంగ్రామంలో 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. 2.27 కోట్ల మంది ఓటర్లు 623 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

  • రేపు, ఎల్లుండి ఆ జిల్లాల్లో సీఎం పర్యటన

CM KCR visits Jangaon and Yadadri districts: నూతనంగా నిర్మించిన మరో రెండు కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

  • 'తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మోదీకి కడుపుమంట'

KTR Comments: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్​.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ కంటే అభివృద్ధి చెందుతున్నామని మోదీకి కడుపుమంటగా ఉందని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

  • 'కొవిడ్‌ మూడోదశ 42 రోజులే'

covid third wave: ఒమిక్రాన్‌ రూపంలో వచ్చిన కొవిడ్‌ మూడోదశ ఎంత వేగంగా వచ్చిందో.. అంతే వేగంగా ముగిసిందని వైద్యశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో గతేడాది డిసెంబరు 28న మూడోదశ కొవిడ్‌ ఉద్ధృతి ప్రారంభం కాగా.. ఈ నెల 7 నాటికి కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. జనవరి 31 నుంచి పరిశీలిస్తే 3.51 నుంచి 2.01 శాతానికి పాజిటివిటీ తగ్గింది.

  • సంచలనంగా ‘కారేపల్లి’ కొవిడ్‌ బీమా పరిహారం

గిరిజనుల అమాయకత్వాన్ని పెట్టుబడిగా పెట్టి ఓ ముఠా అక్రమాలకు తెరలేపి రూ.లక్షలు దండుకొంది. వాళ్లమోసం వెలుగులోకి రావడంతో ఇప్పుడీ ఘటన అనేక మందికి ఉచ్చు బిగించేలా చేస్తోంది. 700 మంది పేరిట బీమా సొమ్ము స్వాహా చేసేందుకు యత్నించిన ఉదంతం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో వెలుగులోకి రావడంతో సూత్రధారులతోపాటు పాత్రధారుల వెన్నులో వణుకు పుడుతోంది.

  • తొలిదశ పోలింగ్​కు 'యూపీ' సిద్ధం

UP Assembly Elections 2022: ఉత్తర్​ప్రదేశ్​లో తొలిదశ పోలింగ్​కు రంగం సిద్ధమైంది. యూపీ మహాసంగ్రామంలో 58 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.

  • రష్యాను భయపెట్టే ఆయుధం ఇదేనా..?

What is Swift?: ఉక్రెయిన్‌ అంశంలో దూకుడుగా ప్రవర్తిస్తున్న రష్యాను కట్టడి చేయాలని అమెరికా యోచిస్తోంది. అయితే.. రష్యాను కట్టడి చేయడానికి అమెరికా ఎదుట ఉన్న బలమైన మార్గం 'స్విఫ్ట్‌' (సొసైటీ ఫర్‌ వరల్డ్‌వైడ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ టెలి కమ్యూనికేషన్‌ సిస్టమ్‌) నుంచి బయటకు పంపించడమే.

  • ఎయిర్​టెల్​ కస్టమర్లకు మరింత భారం!

Airtel Tariff Hike: ఇప్పటికే టారిఫ్​ పెంచి టెలికాం ఛార్జీలను భారంగా మార్చిన ఎయిర్​టెల్.. కస్టమర్లకు మరో షాక్​ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 3-4 నెలల్లో మరోసారి ఛార్జీలను పెంచే అవకాశం ఉందని సంస్థ సీఈఓ వెల్లడించారు.

  • ప్రపంచకప్​ జట్టులో ఆ క్రికెటర్​కు నో ఛాన్స్..

త్వరలో జరిగే మహిళా ప్రపంచకప్​ జట్టులో భారత క్రికెటర్ జెమీమాకు చోటు దక్కలేదు. దీంతో హాకీ టోర్నీ కోసం సిద్ధమైంది. ప్రాక్టీసు చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

  • 'అదే జరిగితే త్వరలో 'డీజే టిల్లు 2''

DJ Tillu movie: తనకు అవకాశాలు రాకపోవడం వల్లే రైటర్​గా మారానని హీరో సిద్ధు అన్నారు. త్వరలో 'డీజే టిల్లు'తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఇతడు.. సినిమా కచ్చితంగా అలరిస్తుందని చెబుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.