ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 8, 2022, 9:00 AM IST

  • నేడు హైదరాబాద్​కు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే..!

Amit shah hyderabad Visit : కేంద్రమంత్రి అమిత్​షా నేడు హైదరాబాద్​కు రానున్నారు. సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. రోడ్డుమార్గంలో ముచ్చింతల్ వెళ్లి... శ్రీరామనగరాన్ని సందర్శించనున్నారు.

  • 'అత్యద్భుతంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం'

Yadadri Architect Anand Sai Interview : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం అత్యంత అద్భుతంగా రూపుదిద్దుకుందని ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్​సాయి తెలిపారు. ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యాధునిక సాంకేతికతతో ఆలయ నిర్మాణం చేశామని చెప్పారు.

  • తొలివిడత కౌన్సెలింగ్‌లో 190 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు

MBBS Seats for Gurukul students: బాల్యంలోనే కన్నతండ్రిని కోల్పోయి..కడు పేదరికాన్ని అనుభవిస్తున్న నేపథ్యం ఒకరిది. తండ్రి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా సేవలందిస్తుండగా రెక్కాడితే కానీ డొక్కాడని దయనీయ కుటుంబం ఇంకొకరిది.. తల్లి కూలి చేసి ఇల్లు నెట్టుకొస్తుంటే ఆ పేదరిక ఛాయల్ని పసితనంలోనే చవిచూసిన జ్ఞాపకాలు కొందరివి.. ఇలాంటి కఠిన నేపథ్యాలు వెంటాడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో విద్యార్థులు ముందడుగు వేశారు.

  • 'సినిమా థియేటర్​ను మూసే అధికారం తహసీల్దార్​కు లేదు'

AP High Court On Cinema Theater : సినిమా థియేటర్​కు తహసీల్దార్ తాళం వేయడాన్ని తప్పుపట్టిన ఏపీ హైకోర్టు.. థియేటర్​ను తెరవాలని తహసీల్దార్​ను ఆదేశించింది. విజయనగరం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్​ను మూసివేయడాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన వ్యాజ్యంపై ఈ మేరకు తీర్పునిచ్చింది.

  • ఈ నెల 14 నుంచి సుప్రీంకోర్టులో భౌతిక విచారణలు

Supreme Court Physical Hearing: సుప్రీంకోర్టులో ఈ నెల 14 నుంచి భౌతిక విచారణలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కమిటీతో సంప్రదింపుల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

  • కర్షకుల తీర్పుపై భాజపాలో ఉత్కంఠ..

Farmers Protest affect BJP: వ్యవసాయ చట్టాలపై రైతుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. కొన్ని రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో కూడా రైతులకు ఒరగబెట్టిందేమీ లేదు. తమ అపరిష్కృత డిమాండ్లను నెరవేర్చడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైనందుకు వారు ఇటీవలే విశ్వాస్‌ఘాత్‌ దినాన్ని నిర్వహించారు.

  • టార్చ్‌బేరర్‌ వివాదంపై చైనా ఏమందంటే..?

Winter Olympic Torch Bearer: బీజింగ్​లో జరుగుతోన్న వింటర్ ఒలింపిక్స్‌లో భాగంగా టార్చ్‌బేరర్‌ ఎంపికపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టార్చ్‌బేరర్‌ అంశంపై చైనా స్పందించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి ఎంపిక నియమాలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేసింది.

  • షేర్ల పెట్టుబడుల్లో చిన్నోళ్ల జోరు

Small scale Investors in Stock Market: స్టాక్‌ మార్కెట్లో చిన్న మదుపర్ల హవా పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ కంపెనీల్లో రికార్డు గరిష్ఠాలకు వీరి వాటాలు చేరుతున్నాయి. బ్యాంక్‌, పోస్టాఫీస్‌ డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడులకే పరిమితమైన వారు.. మార్కెట్‌ వైపు అడుగేయడంతో ఇది సాధ్యమైంది.

  • ఆ జట్టు పేరు అహ్మదాబాద్‌ టైటాన్స్‌

Ahmedabad IPL Team Name: ఐపీఎల్​ కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌.. తమ జట్టుకు 'అహ్మదాబాద్‌ టైటాన్స్‌' అని పేరు ఖరారు చేసింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

  • 'హీరోయిన్​తో ఎప్పుడూ ముగ్గురు, నలుగురు..'

DJ Tillu: 'డీజే టిల్లు' పాత్ర హీరో సిద్ధులోనే కనిపించిందని చెప్పారు ఆ చిత్ర దర్శకుడు విమల్‌కృష్ణ. ప్రచార చిత్రాలు, పాటలతో ఆసక్తిరేపిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించిన పలు విశేషాలను పంచుకున్నారు విమల్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.