ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @7AM - latest news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Feb 5, 2022, 7:01 AM IST

  • నేడు అత్యంత కీలక ఘట్టం

Modi Visit Statue of Equality: జగద్గురు శ్రీరామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు అత్యంత కీలకమైన ఘట్టం జరగబోతుంది. భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమతామూర్తి విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 3 గంటలపాటు ముచ్చింతల్​లోనే మోదీ గడపనున్నారు. ప్రధాని రాక సందర్భంగా 8 వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక కార్యక్రమం

Statue Of Equality: గొప్ప సంకల్పంతో కనీవినీ ఎరుగని భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం..! కళ్లు చెదిరే అపురూప నిర్మాణాలు... 108 ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహాం..! ఎటు చూసినా.. ఏం చేసినా... తొమ్మిది అనే అంకెతో ముడిపడే నిర్మాణ చాతుర్యం..!

  • జాతర ముగిశాకే బడ్జెట్​ సమావేశాలు!

Telangana Assembly Budget Session: ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిశాక సమావేశాలను ప్రారంభించి.. యాదాద్రి పునఃప్రారంభ ముహూర్తానికి వీలైనంత ముందే ముగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉభయసభలను ప్రోరోగ్ (నిరవధిక వాయిదా) చేసి ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

  • మే 21న నీట్​ పీజీ ఎంట్రన్స్​

NEET PG Exam: నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేశారు. ఈ పరీక్షమే 21న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల బోర్డు ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షను వాయిదా వేయాలని పరీక్షల బోర్డును కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది.

  • ఆ కారణంగానే ఒమిక్రాన్‌ లక్షణాలు స్వల్పం!

Omicron variant: కరోనావైరస్‌ గుణం కంటే వాటిని ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ప్రజల్లో అధికంగా ఉండటం వల్లే ఒమిక్రాన్‌ తీవ్రత తక్కువగా ఉండటానికి కారణమనే అంచనాకు వచ్చారు నిపుణులు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పిన శాస్త్రవేత్తలు, సాధ్యమైనంత త్వరగా ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలకు కరోనా వ్యాక్సిన్లను అందించే ప్రయత్నం చేయాలని సూచించారు.

  • స్పుత్నిక్​ లైట్​ టీకా వినియోగానికి అనుమతి!

Sputnik light vaccine: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-లైట్‌ అత్యవసర వినియోగానికి నిపుణుల కమిటీ.. డీసీజీఐకు సిఫారసు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 31న జరిగిన నిపుణుల కమిటీ సమావేశంలో ఈ మేరకు సిఫారసు చేసినట్లు పేర్కొన్నాయి.

  • ఒక్కనెలలో 4,67,000 మందికి ఉద్యోగాలు

US Job Openings: అమెరికాలో జనవరిలో 4.67 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించినట్లు ఆ దేశ కార్మిక శాఖ వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ప్రభావం ఉన్నప్పటికీ.. అంచనాలకు మించి నియామకాలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.

  • ఎల్​ఐసీ రికార్డులు తిరగరాస్తుందా?

దేశంలోనే అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీగా ఎల్​ఐసీ గుర్తింపు సాధిస్తుందని స్టాక్‌మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పబ్లిక్‌ ఇష్యూ తర్వాత మార్కెట్‌ విలువలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను మించుతుందని భావిస్తున్నాయి. ఇదే జరిగితే దేశీయ నమోదిత కంపెనీల్లో అత్యధిక మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీగా ఎల్‌ఐసీ ఆవిర్భవిస్తుందని జోస్యం చెబుతున్నాయి.

  • ఐదోసారి కప్పుపై కన్నేసిన భారత్

Ind vs eng: ఐదోసారి అండర్-19 ప్రపంచకప్ కొట్టేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఇంగ్లాండ్​తో శనివారం అమితుమీ తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం కానుంది.

  • 'బిగ్​బాస్' ఓటీటీ.. అప్పటినుంచే స్ట్రీమింగ్?

Bigg boss OTT: గత ఐదు సీజన్లు టీవీ ప్రేక్షకుల్ని అలరించిన 'బిగ్​బాస్'.. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్​కు సిద్ధమైంది. ఈనెల చివరి నుంచి ప్రసారం కానుందని సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.