ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1PM - latest news in Telugu

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Jan 12, 2022, 12:58 PM IST

  • 'రూ.లక్ష కోట్లు మా ప్రభుత్వ పెద్దలే తినేశారు.. దీనిలో ఎలాంటి అతిశయోక్తి లేదు..'

MP Raghu Rama Krishna Raju Latest Press meet: రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే.. అది రాజద్రోహం ఎలా అవుతుందంటూ.. ఏపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీకి ఏడు లక్షల కోట్ల అప్పు ఉంటే.. దానిలో రూ.ఒక లక్ష కోట్లు మా ప్రభుత్వ పెద్దలు తినేశారనడంలో అతిశయోక్తే లేదని వ్యాఖ్యానించారు. పండుగకు వస్తున్నా.. అని తెలిసే.. సీఐడీతో నోటీసులు ఇప్పించారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • సినిమా టికెట్ల కోసం త్వరలో ఆన్‌లైన్‌ పోర్టల్‌ : తలసాని

Talasani on theatres: సినీ పరిశ్రమపై మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ సమస్యలపై సత్వరమే స్పందిస్తున్నామని.. ఈ రంగంపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని తెలిపారు. సినీ పరిశ్రమపై ప్రభుత్వం బలవంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు. సందర్భాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

  • భద్రాద్రిలో నేడు స్వామివారి తెప్పోత్సవం.. భక్తులకు అనుమతి నిరాకరణ

Theppotsavam in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. కరోనా ఆంక్షల కారణంగా గోదావరిలో తెప్పోత్సవం నిలిపివేస్తున్నట్లు చెప్పిన అధికారులు.. నేడు బేడా మండపం సమీపంలో నిర్వహించనున్నారు.

  • విమానాశ్రయంలో రూ.7.43 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

Drugs Seized in Delhi: విదేశాల నుంచి భారత్​కు మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1,060 గ్రాముల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7.43 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.

  • యువత బలంతో ఉన్నత శిఖరాలకు భారత్​: మోదీ

భారత దేశానికి యువతే అభివృద్ధి ఛోదకులన్నారు ప్రధాని మోదీ. వారికి 2022 ఎంతో కీలకమన్నారు. యువత వల్లే డిజిటల్ పేమెంట్స్​లో భారత్​ దూసుకుపోతోందని కొనియాడారు.

  • ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై విచారణకు సుప్రీం కమిటీ

PM security breach: ప్రధాని మోదీ పంజాబ్​ పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఇందూ మల్హోత్రా దీనికి నేతృత్వం వహించనున్నారు.

  • కరోనా ప్రళయం- ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 27 లక్షల మందికి వైరస్​

World corona cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 27 వేల 72 వేల మందికిపైగా వైరస్​ బారిన పడ్డారు. అమెరికాలో కొవిడ్​ బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు. ఫ్రాన్స్​లో మూడు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఇటలీలో రెండు లక్షల మందికిపైగా వైరస్​ సోకింది. స్పెయిన్​, జర్మనీ, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

  • 'భారత్​- పాక్​, ఆ రెండు జట్లతో టీ20 సిరీస్​.. ఐసీసీకి ప్రతిపాదిస్తా'

India VS Pakistan: భారత్-పాకిస్థాన్ సిరీస్​ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై ఆసక్తికర ట్వీట్ చేశాడు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా. భారత్​, పాక్​ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ జట్లు కూడా ఈ సూపర్​ సిరీస్​లో ఆడేలా ఐసీసీకి ప్రతిపాదిస్తానని అన్నాడు.

  • హెల్త్ అప్డేట్.. లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే

Lata mangeshkar covid: సింగర్ లతా మంగేష్కర్ తాజా హెల్త్ అప్డేట్ వచ్చేసింది. ఐసీయూలో ఉన్న ఆమె కొవిడ్​తో పాటు న్యూమోనియాతో ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.