ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @9AM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​ @9AM
author img

By

Published : May 13, 2021, 8:58 AM IST

ఇంటింటి సర్వేలో నిజాలు

నల్గొండ జిల్లాలో గత వారం రోజుల్లో కొవిడ్‌ కేసులు 1,875. ఈ సమయంలో ఇదే జిల్లాలో ఇంటింటి సర్వేలో కరోనా లక్షణాలున్నట్టు గుర్తించిన వారు 9,433 మంది. అధికారికంగా ప్రకటించిన కేసుల కంటే లక్షణాలున్న వారు దాదాపు అయిదింతలు ఎక్కువన్నమాట. రాష్ట్రంలో కొవిడ్‌ లక్షణాలతో ప్రజలు పెద్దఎత్తున బాధపడుతున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మధ్యాహ్నం నుంచి గప్‌చుప్‌

బుధవారం తెల్లవారుతూనే జనం హడావిడిగా ఇంటి నుంచి బయలుదేరారు. కొందరు కూరగాయల మార్కెట్లకు, మరికొందరు నిత్యావసర వస్తువుల కోసం.. ఇంకొందరు సొంతూళ్లకు.. గడియారాల్లో, ఫోన్లలో సమయం చూసుకుంటూ.. ఎవరి తొందరి వారిదే.. ఎవరి అవసరాలు వారివే.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు.. నాలుగు గంటల పాటు ఉరుకులూ పరుగులూ.. ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈ-పాస్‌ ఇక్కట్లు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారికి ఈ-పాస్‌లు జారీ చేస్తామంటూ తెలంగాణ పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రకటించారు. అయితే మార్గదర్శకాలు, నిబంధనలపై స్పష్టత లేకపోవడంతో జనం ఇక్కట్లు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆసుపత్రులు తక్షణావసరం

కరోనా రెండో దశ ఏర్పడ్డ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో దేశంలో తాత్కాలిక ఆసుపత్రుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డీఆర్​డీఓ, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ వంటి సంస్థలు తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణానికి కృషి చేస్తున్నాయి. కేంద్రం ఈ ఆసుపత్రుల ఏర్పాట్లను ముమ్మరం చేసి.. వైద్య విద్యార్థుల సహాయంతో ఆసుపత్రులను నిర్వహించాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నలుగురు దుర్మరణం

లారీ-కారు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆర్థిక రికవరీకి సవాళ్లు

ఆత్మనిర్భర్‌ పథకం ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందకముందే భారత్‌పై కొవిడ్‌ రెండో దశ విరుచుకుపడింది. మొదటి దశ ముగిశాక భారత్‌ వేగంగా కోలుకొంటోందని భావిస్తూ మన వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన ఆర్థికవేత్తలు, రెండోదశ విజృంభణతో తమ అంచనాలను తగ్గించేశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ పెంచుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించాలంటే కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8 వారాల లాక్‌డౌన్‌!

కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ అవసరమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సూచించింది. పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గితే ఆంక్షలు సడలించవచ్చని ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ పేర్కొన్నారు. కొవిడ్​ కట్టడికి ఎన్ని రోజులు లాక్‌డౌన్‌ అవసరమనే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన సూచనలకు ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జన్యుమార్పిడి దోమలు!

విష జ్వరాలను తగ్గించేందుకు అమెరికా పరిశోధకులు జన్యుమార్పిడి చేసిన దోమలను సృష్టించారు. ప్రయోగాత్మకంగా వాటిని జనంలోకి వదిలారు. ఈ మగ దోమలు.. వ్యాధులకు కారణమయ్యే ఆడదోమలను కలుసుకొని వాటి మరణానికి కారణమవుతాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సెరెనా ఔట్

ఇటాలియన్​ ఓపెన్​లో అమెరికా టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ ఓటమిపాలైంది. అర్జెంటినాకు చెందిన నదియా పొదరోస్కా చేతిలో కంగుతింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సల్మాన్​తో అంటే భయపడ్డా!

సల్మాన్ ఖాన్, దిశా పటానీ హీరోహీరోయిన్లుగా నటించిన 'రాధే' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దిశా పలు విషయాలు పంచుకుంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.