ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN 5PM
top news in Telugu
author img

By

Published : Apr 12, 2021, 5:00 PM IST

1. స్పుత్నిక్-వి వినియోగానికి గ్రీన్​ సిగ్నల్​

భారత్​లో స్పుత్నిక్-వి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ.. ఈ నిర్ణయం తీసుకుంది. డీసీజీఐ తుది నిర్ణయం అనంతరం టీకా అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. భాగ్య నగరంలో చిరుజల్లులు

నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిపించి జనాలకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించాడు. సికింద్రాబాద్​, బేగంపేట, ప్యారడైజ్​, సంగీత్​, ష్టేషన్​, చిలకలగూడా, బోయిన్​పల్లి, అల్వాల్​ ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎస్సార్​నగర్, సనత్​నగర్ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడి చిరుజల్లులు కురిశాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. వ్యవసాయ శాఖ మంత్రికి కొవిడ్​ పాజిటివ్​

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. గత రెండు రోజులుగా అస్వస్థతగా ఉండడంతో వనపర్తిలో పరీక్షలు చేయించుకున్నారు. గత రెండు, మూడు రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ప్రత్యేక ఏర్పాట్లు

నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం... పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారులు దృష్టిసారించారు. ఈ నెల 11 నుంచి... అర్హులైన వ్యక్తుల బ్యాలెట్ పత్రాలు సేకరిస్తున్నారు. వికలాంగులు, కొవిడ్ బాధితులు, 80 ఏళ్లు దాటిన వారు ఈ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునేలా ఈసారి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మూడు నెలల్లో...

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది పనులు ప్రారంభమైనట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. భారీ వరదలను తట్టుకునేందుకు వీలుగా భూమి లోపల నుంచి గోడలు నిర్మించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. కుంభమేళకు పోటెత్తిన భక్తులు

ఉత్తరాఖండ్​​ హరిద్వార్​లోని కుంభమేళాలో పుష్కర ఘాట్లు సోమవారం.. 'హరహర మాహాదేవ్​', 'గంగా మాతాకీ జై' నినాదాలతో హోరెత్తాయి. కుంభమేళలో భాగంగా 'హర్​ కీ పౌరీ' ఘాట్ వద్ద సోమవారం అఘోరాలు, సాధువులు, భక్తులు రెండో షాహీ స్నానాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. ఫాస్ట్​ఫుడ్​ కోసం భర్త లంచ్​బాక్స్​ తిప్పలు

ఫాస్ట్​ఫుడ్​ అంటే మనలో చాలా మందికి ఇష్టమే. కానీ ఓ వ్యక్తి మాత్రం.. తన భార్య ఎంతో ఇష్టంగా చేసి పెట్టే లంచ్​బాక్స్​ను అమ్మి మరీ ఫాస్ట్​ఫుడ్​ తినడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారం తెలుసుకున్న భార్య ఒక్కసారి షాక్​ అయ్యింది. ఆమె పంచుకున్న కథ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. అసలు ఏం జరిగింది?

8. కుదేలైన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్​ ఏకంగా 1,708 పాయింట్లు తగ్గి.. 47,883 వద్దకు చేరింది. నిఫ్టీ 524 పాయింట్ల నష్టంతో 14,350 మార్క్​ను కోల్పోయింది. ఇండస్​ఇండ్ బ్యాంక్​ షేర్లు భారీగా పతనమయ్యాయి. డాక్టర్​ రెడ్డీస్​ మాత్రం దాదాపు 5 శాతానికిపైగా పుంజుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. డ్యాన్స్​తో అదరగొట్టిన సన్​రైజర్స్​

ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్, సన్​రైజర్స్​ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​కు​ క్రికెట్​ అంటే ఎంత ఇష్టమో.. డ్యాన్స్ అన్న అంతే మక్కువ. తాజాగా తన ఐపీఎల్​ సహచరులతో కలిసి చిందులేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. పరీక్షలు రద్దు చేయండి

కరోనా సెకండ్​ వేవ్​ విజృంభిస్తోన్న నేపథ్యంలో సీబీఎస్​ఈ ఆఫ్​లైన్​ పరీక్షలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు బాలీవుడ్​ నటుడు సోనూసూద్​. ఇంటర్నల్​ అసెస్​మెంట్​​ ద్వారా వారిని ప్రమోట్​ చేయాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.