1. వికాస్ దూబే అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పుర్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన సూత్రధారి అరెస్టయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రౌడీ షీటర్ వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2. రికార్డు స్థాయిలో కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్తగా రికార్డు స్థాయిలో 24,879 కేసులు నమోదయ్యాయి. 487మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 7,67,296కు చేరింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3. ఫలితాలు రాకముందే..
కింగ్‌కోఠి, ఉస్మానియా ఆసుపత్రుల్లో కరోనా అనుమానితులను చేర్చుకొని... పరీక్షలు చేస్తుంటారు. పాజిటివ్ వచ్చిన వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలిస్తుంటారు. శాంపిళ్లు సేకరించి ఫలితాలు రాకముందే పలువురు మృత్యువాత పడుతున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4. ప్రైవేటులో చేర్చుకోరు...
హైదరాబాద్ నగరంలో పలువురు కరోనా రోగులకు తక్షణ వైద్యం అందకపోవడంతో పిట్టల్లా రాలిపోతున్నారు. కుటుంబీకుల నిర్లక్ష్యం కొంత ఉంటే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తమ దగ్గరకు అత్యవసర వైద్యం కోసం వచ్చేవారిని తక్షణం చేర్చుకోకపోవడమూ ఒక కారణమే. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5. టోల్ సిబ్బందిపై వ్యక్తి దాడి..
టోల్‌ప్లాజా వద్ద సెక్యూరిటీ గార్డుపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగింది. బాధితుడిని టోల్‌ప్లాజా సిబ్బంది ఒంగోలు ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6. కరోనా విలయం
ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసులు కోటి 21 లక్షల 64 వేలు దాటాయి. 5 లక్షల 52 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 70 లక్షల 30 వేల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
7. టెస్టుల కోసం కారులోనే...
అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 31లక్షలు దాటాయి. అనేక రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. అయితే కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు గంటల తరబడి కార్లల్లోనే నిరీక్షిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
8. లాభాల బాటలో...
స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 220 పాయింట్లకుపైగా లాభంతో 36,549 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 60 పాయింట్లు పుంజుకుని 10,764 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
9. జూనియర్ బోల్ట్
పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్.. ఇటీవల తన భార్యకు జన్మించిన కూతురు ఫొటోను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. తన పేరు 'లైట్నింగ్' అని ప్రకటించాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
10. చెప్పులు విసిరారు..
దర్శకుడు మహేష్ భట్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోషల్‌మీడియా టీమ్. ఓ సందర్భంలో కంగనాపై ఆయన చెప్పులు విసిరినట్లు తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.