బిల్లులు బాబోయ్..
లాక్‌డౌన్‌తో మీటర్ రీడింగ్ కార్మికులు బయటకు రాలేదు, బిల్లులు కొట్టలేదు. విద్యుత్ శాఖకు సడలింపులు ఇచ్చిన సడలింపులతో ఒకేసారి మూడు నెలల రీడింగ్ లెక్కించి తీస్తున్నారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే..?
ఎక్కాలంటే గుబులే!
కరోనా నేపథ్యంలో ప్రయాణమంటే ప్రజల్లో గుబులు నెలకొంది. తప్పనిసరైతేనే బస్సు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. అధిక శాతం శుభకార్యాలు వాయిదా వేసుకుంటున్నారు. బస్సుల్లో ప్రయాణించేందుకు ఎందుకు వెనకాడుతున్నారంటే...
2 ఎత్తిపోతలు... 2 జలాశయాలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదిపై ఉన్న జూరాల జలాశయ నిల్వ సామర్థ్యం తగ్గి... తాగు, సాగునీటి అవసరాలకు చాలని స్థితిలో... నెట్టెంపాడు, గట్టు జలాశయాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటున్నాయి. రెండు జలాశయాలకు కలిపి ఎంత ఖర్చు అవుతుందంటే...
మహిళల వివాహ వయస్సు పెంపు!
కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళ ఏ వయస్సులో తల్లి కావడం ఆరోగ్యకరమో అధ్యయనం చేయడానికి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ.... ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం ఇందుకు ఊతమిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి...
ఆసుపత్రులు తిరిగి చనిపోయిన గర్భణి!
కనీస వసతులు లేని ఆసుపత్రుల నిర్లక్ష్య ధోరణి నిండు గర్భిణిని పొట్టనపెట్టుకుంది. చికిత్స కోసం 8 ఆసుపత్రుల గడప తొక్కిన మహిళను వసుతులు లేవని సిబ్బంది తిప్పి పంపారు. బెడ్ కోసం 13 గంటలపాటు వెతికి.. ఆఖరికి నొప్పిని భరించలేక అంబులెన్స్‌లో ప్రాణం విడిచింది ఆమె. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...
4 లక్షలు దాటిన కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 4 లక్షలు దాటింది. మొత్తం బాధితుల సంఖ్య 70 లక్షలకు చేరువలో ఉంది. గత 24 గంటల వ్యవధిలో లక్షా 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరిన్ని వివరాలు..
ముందు సంప్రదిద్దాం..
తమ మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి భారత్-చైనాలు. లద్ధాఖ్ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి నెల రోజులుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు సమావేశమైన ఇరుదేశాలకు చెందిన లెఫ్టినెంట్ జనరల్‌లు ఈ మేరకు ఓ అంగీకారానికి వచ్చారు. ఇంకేమి చర్చించారంటే...
కుదేలైన ఆర్థిక రథం కదలాలంటే?'
కరోనా సంక్షోభం ముంచుకురావడం వల్ల మోదీ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికకు విఘాతం ఏర్పడింది. బడ్జెట్లో ప్రకటించిన వివిధ కార్యక్రమాలను నిలిపివేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వం పేరుకు రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించినా, వాస్తవ కేటాయింపులు జీడీపీలో రెండు శాతాన్ని మించవని కొందరు నిపుణుల అంచనా.
'అలా అనిపించలేదు'
గతేడాది ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ కావాలనే ఓడినట్లు అనిపించలేదని అన్నాడు మాజీ క్రికెటర్ మైకేల్ హోల్డింగ్. ఆ రోజు మహీ ముఖంలో గెలవాలన్న తపన కనిపించిందని చెప్పాడు. ఇంకేమన్నాడంటే...
వకీల్‌సాబ్ పైనే!
సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చిన వెంటనే పవన్.. తన కొత్త ప్రాజెక్టులను వరుస షెడ్యూళ్లలో పూర్తి చేయనున్నారట. ఈ విషయాన్ని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు దృష్టంతా దానిపైనే ఉంది అంటున్నారు...