ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 10AM - టాప్ టెన్ న్యూస్

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top ten news till 10am
టాప్​టెన్​ న్యూస్​@ 10AM
author img

By

Published : May 31, 2020, 10:02 AM IST

దేశంలో విజృంభిస్తున్న కరోనా

దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,380 మందికి‬ కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.‬ ఇప్పటివరకు 24 గంటల్లో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య ఎంతంటే..

కరోనా ఉన్నా... ఇంటికే!

కొవిడ్​ వ్యాధి ఉన్నా లక్షణాలు లేని వారిని హోం క్వారంటైన్​కు తరలించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 315 మందిని ఎంపిక చేసి వారి సమాచారాన్ని ఆయా జిల్లాల డీఎంహెచ్​వోలకు అందించారు. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంలో ఇంకా ఏమున్నాయంటే..

గొర్రెల సంఖ్యలో అగ్రస్థానం

దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అత్యధిక గొర్రెలున్నాయి. జాతీయ సగటు తలసరి మాంసం వినియోగం, వృద్ధిరేటులోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ పశుగణన తాజా నివేదికలో వెల్లడించింది. మరిన్ని వివరాలు

సచివాలయంలో ముగ్గురికి కరోనా

ఆంధ్రప్రదేశ్​లోని సచివాలయంలో కరోనా కలకలం రేపింది. హైదరాబాద్​ నుంచి వచ్చిన ముగ్గురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్​గా వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయ కానిస్టేబుల్​కు సైతం మహమ్మారి సోకినట్లు నిర్థరణ అయ్యింది. అధికారులు అప్రమత్తమై ఏం చేశారంటే..

'మన్​కీ బాత్'

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్​కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో లాక్​డౌన్ 5.0పై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఏ అంశాలపై చర్చిస్తారంటే..

పొగరాయుళ్లకే ఎక్కువ.

పొగతాగడం వల్ల కరోనా వస్తుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. హైదరాబాద్​లో ముడు రోజుల క్రితం.. తన మిత్రులతో సిగరెట్​ పంచుకోగా.. వారందరికీ వైరస్​ సోకింది. సాధారణ జనంతో పోలిస్తే 14శాతం ఎక్కువ కరోనా ప్రభావం పొగరాయుళ్లపై ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ ఓ నివేదికలో వెల్లడించింది. దీనిపై ఆసక్తికర విషయాలు..

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,24,103 కొవిడ్​-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 61 లక్షల 54 వేలు దాటింది. మరిన్ని వివరాలు..

జీ-7 సదస్సు వాయిదా

జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సును కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గే వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. కూటమిలో సభ్యత్వాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. ఇంకేమన్నారంటే.

మాజీ ఫుట్​బాలర్ మృతి

భారత మాజీ ఫుట్​బాల్ ఆటగాడు బీర్ బహుదూర్, శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల తెలంగాణ ఫుట్​బాల్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అంత్యక్రియలు ఎప్పుడంటే..

సర్కార్ వారి పాట మొదలైంది..

సూపర్​స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా మహేశ్ కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను రిలీజ్​ చేశారు. ఈ చిత్రానికి 'సర్కార్ వారిపాట' అనే పేరు పెట్టారు.​ లుక్​ ఎలా ఉందంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.