ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Jan 22, 2021, 9:07 PM IST

top ten news for 9pm
టాప్​టెన్​ న్యూస్​@ 9PM

ముహూర్తం ఖరారు

జీహెచ్​ఎంసీ నూతన మేయర్​ ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి11న జీహెచ్ఎంసీ నూతన మేయర్ ఎన్నిక జరపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

బెయిలొచ్చింది

బోయిన్​పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియకు సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్​ను న్యాయస్థానం​ మంజూరు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

స్టే పొడిగింపు

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై హైకోర్టులో దాఖలైన ఏడు వ్యాజ్యాలపై సీజే జస్టిస్ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న ఉన్నత న్యాయస్థానం.. రెండు పిల్స్​పైనే విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అణుబాంబు పేలుతుంది

దేశంలో పేదరికం ఉండకూడదని అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో చట్టం తీసుకొచ్చామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్​లో అన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అణుబాంబు పేలుతుందని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కేటీఆర్ శుభాకాంక్షలు

మేధా సర్వో డ్రైవ్స్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'వందే భారత్ ట్రైన్స్'ను హైదరాబాద్​కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ తయారు చేయటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వీడని ప్రతిష్టంభన

11వ విడత చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. ఈసారి కూడా చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. సాగు చట్టాల నిలిపివేతపై కేంద్రం మరో ప్రతిపాదన చేసినప్పటికీ.. రైతులు దానిని కూడా వ్యతిరేకించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అపోహలు తొలగించండి

కొవిడ్​ టీకా పొందిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. టీకాపై అపోహలను తొలగించాలని వైద్య సిబ్బందిని కోరారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బేర్​ పంజా..

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. వారాంతపు సెషన్​లో సెన్సెక్స్ భారీగా 746 పాయింట్లు తగ్గి.. 49 వేల మార్క్​ కోల్పోయింది. నిఫ్టీ 218 పాయింట్ల నష్టంతో 14,400 దిగువన స్థిరపడింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పూర్తి షెడ్యూల్ ఇదే!

ఆస్ట్రేలియా పర్యటన తర్వాత స్వదేశంలో జరిగే ఇంగ్లాండ్​ సిరీస్​కు సిద్ధమవుతోంది టీమ్ఇండియా. ఫిబ్రవరి 5న జరిగే తొలి టెస్టుతో పర్యటన ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో పర్యటన పూర్తి షెడ్యూల్​పై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ట్రెండ్ గురూ!

డెస్టినేషన్​ వెడ్డింగ్​కు సెలబ్రిటీలు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఆహ్లాదకరమైన లొకేషన్లలో అతి తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు మొగ్గుచూపుతారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.