1.మేడిగడ్డకు సీఎం
ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటిమట్టం వంద అడుగులకు చేరుకున్న నేపథ్యంలో సీఎం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2.ఆవిష్కరణ
బయో ఆసియా సదస్సు పోస్టర్, వెబ్ సైట్, థీమ్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. లైఫ్ సైన్సెస్ ఈవెంట్స్‌లో అతిపెద్ద ప్రదర్శన బయో ఆసియా సదస్సును కొవిడ్ నేపథ్యంలో వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు బయో ఆసియా నిర్వహణ కమిటీ ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3.జైలుకు పంపుతాం
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘన స్వాగతం లభించింది. డివిజన్ పరిధిలోని చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి, మొయినాబాద్ మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి బండి సంజయ్‌కి ఆహ్వానం పలికారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4.జాప్యం చేసేందుకే
అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి ఓటుకు నోటు కేసు రాదన్న తన పిటిషన్‌పై మళ్లీ వాదనలు వినాలని కోరుతూ... రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై అనిశా కౌంటరు దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5.వేడుకలు రద్దు
రిపబ్లిక్ డే (జనవరి 26) రోజున భారత్- పాక్ సరిహద్దు అయిన వాఘా వద్ద ఎలాంటి వేడుకలు ఉండవని బీఎస్ఎఫ్ వర్గాల వెల్లడించాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6.పోలీసులదే తుది నిర్ణయం
జనవరి 26న రైతులు తల పెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి సంబంధించి నిర్ణయాధికారం దిల్లీ పోలీసులదేనని సుప్రీంకోర్టు తెలిపింది. శాంతి భద్రతలకు సంబధించిన విషయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ వారికుందని పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7.ఆవేదన
టీకా పంపిణీలలో అసమానతలపై డబ్ల్యూహెచ్ఓ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ పేద దేశానికి 25 డోసులు మాత్రమే అందాయని, అదే సమయంలో 50 ధనిక దేశాల్లో 3.9 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8.నష్టాలు
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల నడుమ సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 470 పాయింట్లు కోల్పోయి.. 48,564 వద్దకు చేరింది. నిఫ్టీ 152 పాయింట్లు తగ్గి..14,281 వద్ద స్థిరపడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9.పిచ్ మహిమ
చివరి టెస్టు ఆఖరి రోజున తమ బౌలర్లు సహనంగా ఉండాలని సూచించాడు ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్. గబ్బా పిచ్ అనుకోని రీతిలో స్పందిస్తోందని చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10.మీ ఇష్టం
సూపర్ స్టార్ రాజకీయ రంగ ప్రవేశంపై నిరాశ చెందిన అభిమాన సంఘం నేతలు వేరే పార్టీలో చేరుతున్న నేపథ్యంలో రజనీ మక్కల్ మండ్రం ఓ కీలక ప్రకటన చేసింది. అభిమానులు వారి ఇష్టాలకు అనుగుణంగా ఏ పార్టీలో అయినా చేరవచ్చని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.