ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్ ​@5PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@5PM
author img

By

Published : Jan 18, 2021, 4:58 PM IST

1.మేడిగడ్డకు సీఎం కేసీఆర్​

ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ ఆనకట్ట వద్ద నీటిమట్టం వంద అడుగులకు చేరుకున్న నేపథ్యంలో సీఎం ప్రాజెక్ట్​ను పరిశీలించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2.ఫిబ్రవరి 1 నుంచి

ఈనెల 25 వరకు పాఠశాలలు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థలు, గురుకులాలు, వసతిగృహాలు తెరవడంపై మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌, అధికారులతో సమీక్షించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3.తిరస్కరణ

కిడ్నాప్​ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియ బెయిల్​ పిటిషన్​ను సికింద్రాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. అఖిలప్రియపై పోలీసులు అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు మెమో దాఖలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4.సంతాపం

తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల నర్సింగరావు మృతి పట్ల సీఎం కేసీఆర్​ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాల్లో బూర్గుల ప్రత్యేక పాత్ర పోషించారని కేసీఆర్​ గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5.రైతుల రాజ్యాంగ హక్కు

దిల్లీలో ట్రాక్టర్​ ర్యాలీని శాంతియుతంగా నిర్వహించడం రైతుల రాజ్యాంగ హక్కని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ర్యాలీ జరుపుతామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6.మాట్లాడే భగవద్గీత

మాట్లాడే భగవద్గీత గురించి ఎప్పుడైనా విన్నారా? ఆశ్చర్యపోకండి మనం ఇప్పుడు చూడబోయేది మాట్లాడే గీత గురించే. అదెలా సాధ్యమనుకుంటున్నారా? చదివే అవసరం లేకుండానే సాంకేతికతతో తయారు చేసిన పుస్తకమే చదివి వినిపించేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7.ప్రతిభ అవసరం

దేశంలో గ్రామీణాభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రజాధనానికి రక్షణ ఉండటం చాలా ముఖ్యమని.. కానీ కొంతమంది వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8.ఉద్యోగులకు టీకా

ప్రముఖ స్టీల్​ తయారీ సంస్థలు తమ ఉద్యోగులకు కొవిడ్ టీకా ఇవ్వడానికి నిర్ణయించాయి. కార్పొరేట్​ వ్యవస్థలకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వ్యాక్సినేషన్​ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9.సిరాజ్​ భావోద్వేగం

తొలి టెస్ట్​ సిరీస్​లోనే ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన పేసర్​ మహమ్మద్​ సిరాజ్​ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆనందాన్ని మాటాల్లో చెప్పలేనన్నాడు. కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమైనా.. భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోందని పేర్కొన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10.మొదలైందా?

'ఆదిపురుష్' సినిమా నుంచి మంగళవారం ఉదయం మరో అప్​డేట్​ రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తుండటమే ఇందుకు కారణం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.