1. ఆధారాలు చూపండి
లాభాపేక్షతో కరోనా చికిత్సలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనా చికిత్సలకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులేవో పేర్కొని.. వాటిని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. ఆశలు రేపుతున్న వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది..? ఇంకెన్నాళ్లు నిరీక్షించాలి..? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ. కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో విరుగుడు కనిపెట్టేందుకు భారత్ బయోటెక్ సంస్థ ముందడుగు వేసింది. "కొవాగ్జిన్" పేరిట వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు డీసీజీఐ అనుమతి కూడా పొందింది. వచ్చే నెలలో మనుషులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది భారత్ బయోటెక్. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
3. గోబెల్స్ ప్రచారం
కొండపోచమ్మ సాగర్ కాలువ లీకేజీపై.. కాంగ్రెస్, భాజపాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని ఆర్థికమంత్రి హరీశ్ రావు విమర్శించారు. కాలువకు చిన్నగండి పడితే పెద్ద రాద్దాంతం చేస్తున్నాయన్న హరీశ్... కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు సైతం కొట్టుకుపోయిన విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం.. ఆశ్చర్యంగా ఉందన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. పోరాడుతున్నారు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు పోరాడుతున్నారంటూ గవర్నర్ తమిళి సై అభినందించారు. రాజ్ భవన్ నుంచి వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్యులకు తామున్నామని ధైర్యం చెప్పారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. పార్లమెంట్ సమావేశాలు!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలివారంలో నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తేదీలపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
6. ప్రియాంక గాంధీకి షాక్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. దిల్లీలో ఆమె ఉంటున్న బంగ్లాను ఆగస్టు 1 నాటికి ఖాళీ చేయాలని ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
7. ప్రైవేట్ రైళ్ల పరుగులు!
రైల్వేలో ప్రైవేటు సంస్థలు రూ. 30వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నట్టు భారతీయ రైల్వే వెల్లడించింది. ఒక సారి కార్యకలాపాలు మొదలయ్యాక.. రైళ్ల నిర్వహణ సహా ఇతర ఖర్చులు ప్రైవేటు సంస్థలే భరించాలని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
8. మాట కలిసింది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్... రాజకీయ ప్రత్యర్థులు. ప్రతి విషయంలో ఒకరినొకరు వేలెత్తి చూపించుకునే వీరిరువురు.. ఒక అంశంలో మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎప్పుడూ దూషణల మార్గం అనుసరించే ఈ ఇద్దరూ... ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఒకే స్వరం వినిపిస్తున్నారు. ఏంటా విషయం? ఎందుకు వీరి అభిప్రాయాలు కలిశాయి? పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
9. పూర్ణ కిడ్నాప్ ప్లాన్
హీరోయిన్ పూర్ణను వేధించిన ఎనిమిది మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అయితే వీరు సినీఫక్కీలో పూర్ణను కిడ్నాప్ చేయడానికి భారీ ప్రణాళికను రచించినట్లు వెల్లడించారు పోలీసులు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
10. 'త్రీటీ క్రికెట్' వాయిదా
దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న త్రీటీ క్రికెట్ పోటీ జులై 18కి వాయిదా పడింది. లాక్డౌన్ తర్వాత ఆ దేశంలో ప్రత్యక్షంగా ప్రసారమయ్యే తొలి క్రీడా కార్యక్రమం ఇదే కావడం వల్ల.. క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.