ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@9PM - ts news in telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@9PM
టాప్​టెన్ న్యూస్​@9PM
author img

By

Published : Jun 26, 2020, 8:59 PM IST

పచ్చని తెలంగాణ కోసం..

రాష్ట్రవ్యాప్తంగా ఆరోవిడత హరితహారం జోరుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్​... సభాపతి పోచారం శ్రీనివాస్​తో కలిసి మొక్కలు నాటారు. మానేరు వాగు వద్ద మెగా ప్లాంటేషన్‌లో పాల్గొన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

రెండో రోజు అదే ఉత్సాహం..

ఆరో విడత హరితహారం రెండో రోజు జోరుగా సాగింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు పలు చోట్ల మొక్కలు నాటారు. నాటినంత మాత్రాన బాధ్యత పూర్తవదని.. వాటిని సంరక్షించి మహా వృక్షాలుగా మలచినప్పుడే ప్రయోజనమని మంత్రులు మార్గనిర్దేశం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

కరోనా పంజా

గ్రేట‌ర్ హైద‌రాబాద్ పరిధిలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రతి రోజు వెయ్యి కొత్త కేసులు వచ్చి చేరుతుండటం జంటనగర వాసుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. వైర‌స్ న‌గ‌రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరించటంతో పాటు అనేక ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల మూతకు కారణమవుతోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ప్రేమించినవాడి కారణంగానే..

ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. సరేనని తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఎనిమిది సంవత్సరాల పాటు కలిసి జీవించింది. కానీ ప్రేమించిన వాడే వేధించడం మొదలు పెట్టాడు. రోజూ నరకం చూపాడు. చేసేదేమీ లేక ఆ ఇల్లాలు ప్రాణం విడిచింది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో జరిగింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

హైకోర్టుకు నివేదన

పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ప్రభుత్వ విస్తరణపై కాంగ్రెస్ నేతల తరఫున ఉత్తమ్ కౌంటర్ దాఖలు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

అచ్చెన్నకు ప్రశ్నలు

తెదేపా నేత అచ్చెన్నాయుడిని అనిశా అధికారుల బృందం రెండోరోజూ విచారించింది. ఈరోజు దాదాపు ఐదు గంటల పాటు ప్రశ్నించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మెట్రో పునరుద్ధరణ!

జులై 1 నుంచి మెట్రో సర్వీసులను పునఃప్రారంభించాలని అనుకుంటున్నట్లు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. అలాగే రాత్రి పూట కర్ఫ్యూలో కాస్త సడలింపులు ఇచ్చారు. ప్రస్తుతం జులై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ అమల్లో ఉంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

కరోనా ఉగ్రరూపం

తమిళనాడులో వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజులో 3,645 మందికి వైరస్ సోకింది. మరో 46మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

హైదరాబాద్​లో శిక్షణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే జులై 1 నుంచి బ్యాడ్మింటన్​ శిక్షణా శిబిరాలను తిరిగి ప్రారంభిస్తామని భారత బ్యాడ్మింటన్​ సంఘం కార్యదర్శి అజయ్​ సింఘానియా తెలిపారు. లాక్​డౌన్​ విరామం తర్వాత దేశంలో కొన్ని చోట్ల క్రీడా కార్యకలాపాలు ప్రారంభమైనా.. తెలంగాణలో కరోనా సంక్షోభం పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతించలేదు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

సినీ నిర్లక్ష్యం

ప్రతిభావంతులను సినీ పరిశ్రమ నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు విలక్షణ నటుడు మనోజ్ బాజ్​​పేయీ. దీనిపై ఇండస్ట్రీ ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాలని తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.