ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@7PM
టాప్​టెన్ న్యూస్@7PM
author img

By

Published : Jul 1, 2020, 6:55 PM IST

1. పదవికే ప్రమాదం

హరితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో 85 శాతం ఫలితాలను చూపించనట్లైతే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవి పోతుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. ఒప్పంద ప్రాతిపదికన ఉన్న గ్రామ కార్యదర్శుల పదవి పర్మినెంట్‌ కాదన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

2. మరో కొత్త మండలం

మెదక్ జిల్లాలో మరో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో కొత్త మండలంగా మాసాయిపేటను ఏర్పాటు చేస్తే నోటిఫికేషన్ జారీ చేసింది. చేగుంట మండలంలో మూడు, ఎల్దుర్తి మండలంలో ఆరు గ్రామాలతో మాసాయిపేట మండలం ఏర్పాటు కానుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

3. శుక్రవారంలోగా చెప్పండి

విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు నిర్వహించటం పట్ల హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆన్​లైన్ తరగతులపై స్పష్టమైన, సమగ్రమైన పాలసీని ప్రభుత్వం ఎందుకు రూపొందించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్​లైన్ తరగతుల కోసం అందరికీ లాప్​టాప్​లు, స్మార్ట్​ఫోన్​లు కొనే ఆర్థిక స్థోమత ఉంటుందా అని ధర్మాసనం నిలదీసింది. దీనిపై ఈ నెల 3 లోగా స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

4. మోస్తరు వర్షాలు

ఒడిశా తీరంతోపాటు దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు.. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

5. లాక్​డౌన్​ ఊహాగానాలు

హైదరాబాద్​లో లాక్​డౌన్​ను మరోసారి అమలుచేస్తారనే ప్రచారం నేపథ్యంలో ప్రజలు సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. టోల్​ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. రైల్వే, బస్​ స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

6. వైకాపాలో వర్గ విభేదాలు

గుంటూరు జిల్లా వైకాపాలో వర్గ విభేదాలు మళ్లీ రోడ్డున పడ్డాయి. తాజాగా ఎంపీ లావు కృష్ణదేవరాయల పర్యటనను ఎమ్మెల్యే రజినీ వర్గీయులు మరోసారి అడ్డుకున్నారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త గంటా హరికృష్ణను పరామర్శించేందుకు వచ్చిన ఎంపీని ఎమ్మెల్యే వర్గీయుడు, మార్కెట్​ యార్డ్ వైస్ ఛైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి అడ్డుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

7. లద్దాఖ్​కు రక్షణమంత్రి

వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైన్యం భారీగా మోహరించడం, ప్రతిగా భారత్ అదే స్థాయిలో బలగాలను సరిహద్దుకు తరలిస్తున్న నేపథ్యంలో.. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ శుక్రవారం లేహ్​ను సందర్శించనున్నారు. తూర్పు లద్దాఖ్​లో భద్రత, సైన్యం సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనున్నారు రాజ్​నాథ్. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

8. చైనా సంస్థలకు నో ఎంట్రీ

రోడ్డు నిర్మాణ కార్యకలాపాల్లో చైనా సంస్థలను నిషేధిస్తున్నట్టు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తెలిపారు. ఎమ్​ఎస్​ఎమ్​ఈల్లోనూ చైనా సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించమని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

9. నేనూ ఎదుర్కొన్నా!

బాలీవుడ్​లో గతంలో తాను సవాళ్లు ఎదుర్కొన్నానని చెప్పిన సైఫ్ అలీఖాన్.. సుశాంత్ సింగ్ మరణం గురించి మాట్లాడారు. అతడు అకస్మాత్తుగా చనిపోవడం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

10. క్రికెటర్ల సలాం

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత క్రికెటర్లు వారికి సలాం కొట్టారు. కరోనాపై పోరులో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను రక్షిస్తున్నారని ప్రశంసించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.