ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్@7PM - latest news in telangana

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@7PM
టాప్​టెన్​ న్యూస్@7PM
author img

By

Published : Jun 30, 2020, 6:59 PM IST

1. మహిళలు మిస్సింగ్​!

ప్రపంచవ్యాప్తంగా గడిచిన యాభై ఏళ్లలో 14.26 కోట్ల మంది మహిళలు కనిపించకుండా పోతే.. అందులో మూడో వంతు భారత్​లోనే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 50 ఏళ్లలో సుమారు 4.58 కోట్ల మంది కనిపించకుండా పోయారని లెక్కగట్టింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

2. చైనా యాప్​లు పనిచేస్తాయా?

చైనాకు చెందిన 59 యాప్​లపై భారత ప్రభుత్వం నిషేధం విధించడం వల్ల వాటి భవితవ్యంపై కీలక చర్చ నడుస్తోంది. ఇప్పటికే కొన్నియాప్​లను యాపిల్​, గూగుల్​ తమ ప్లే స్టోర్​ల నుంచి తొలగించాయి. మరికొన్ని మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటిపై నిషేధం ఎలా అమలు అవుతుంది? పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

3. ప్రభుత్వానికి ఉత్తమ్ ప్రశ్న

పారిశుద్ధ్య కార్మికులకు, వైద్యులకు, పోలీసులకు, జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణిస్తే 50 లక్షల పరిహారం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను కరోనా వారియర్స్​గా గుర్తించాలని కోరారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

4. సీబీఐ విచారణ

కొండపోచమ్మ, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యత లోపాలు రోజుకోకటి బయట పడుతున్నాయని ఎంపీ రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించి.. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

5.నిధుల విడుదల

కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్‌కు నిధుల విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.2,587.94 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

6.'చైనా దొంగాట'

చైనా వస్తువులను బహిష్కరించాలని కోరుతోన్న అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ).. భారత అంకురాల్లో చైనా పెట్టుబడులపైనా దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దేశీయ స్టార్టప్​ల సమాచారం చైనా పెట్టుబడిదారులకు వెళ్లకుండా, దాని ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని సూచిస్తూ.. కేంద్రం ఆర్థిక, వాణిజ్య, ఐటీ శాఖలకు లేఖలు రాసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

7. సర్కార్​పై కేసు వేయొచ్చు

చైనా యాప్​ టిక్​టాక్​.. తమపై విధించిన బ్యాన్​ను ఖండించింది. ప్రభుత్వ నిర్ణయంపై కేసు దాఖలు చేసే యోచనలో ఉంది. అయితే, టిక్​టాక్​ మాత్రమే కాదు.. బ్యాన్​ చేసిన అన్ని యాప్​లూ ప్రభుత్వాన్ని కోర్టులో ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం కల్పిస్తోందంటున్నారు ప్రముఖ న్యాయవాదులు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

8. మళ్లీ పెరిగిన బంగారం ధర

ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.119 ఎగబాకింది. కిలో వెండి ధర మళ్లీ రూ.49 వేలు దాటింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

9. నన్ను తీసేశారు

నటిగా సినీపరిశ్రమకు వచ్చిన కొత్తలో ఓ సినిమా నుంచి తనను తీసేశారని చెప్పింది బాలీవుడ్​ హీరోయిన్​ ప్రియాంక చోప్రా. తన కెరీర్​లో ఎన్నో అవరోధాలు ఎదురైనా.. వాటన్నిటిని ఎదుర్కొని నటిగా మంచి గుర్తింపు సాధించినట్లు తెలిపింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

10. భారత్​ ఎప్పుడూ సురక్షితమే

పాకిస్థాన్ జట్టు వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ కోసం భారత్​కు వస్తే భద్రత పెద్ద సమస్య కాదని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా తెలిపాడు. భారత్​లో పర్యటన కోసం బీసీసీఐ నుంచి లిఖిత పూర్వక హామీ ఇప్పించాలని ఇటీవలే పాక్​ క్రికెట్​ పోర్డు ఐసీసీని కోరిన నేపథ్యంలో చోప్రా ఈ వ్యాఖ్యలు చేశాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.