1. వీకే సింగ్‌పై బదిలీ వేటు
తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని వీకే సింగ్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. పోలీస్ రిక్రూట్‌మెంట్ ఛైర్మన్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
2. లాక్‌డౌన్‌పై త్వరలో నిర్ణయం
జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ... పెరుగుతున్న వేళ వైరస్ కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు, నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొద్ది రోజుల పాటు లాక్డౌన్ విధించాలనే ప్రతిపాదనలపైనా... తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. పూర్తి సమచారం కోసం క్లిక్ చేయండి.
3. పోలీస్ అకాడమీలో 180 మందికి కరోనా
రాష్ట్ర పోలీస్ అకాడమీలో కరోనా కలకలం. దాదాపు 180 మందికి కరోనా పాటిజివ్‌గా తేలింది. అందులో 100 మంది శిక్షణ ఎస్సైలు, 80 మంది సిబ్బంది ఉన్నారు. కొవిడ్ బాధిత అధికారులను అకాడమీలొనే ఐసోలేషన్‌లో ఉంచారు. తాజా కేసులతో ఆకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఎస్సైలు, కానిస్టేబుళ్లు ఆందోళన చెందుతున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
4. ఆయనది 360 డిగ్రీల వ్యక్తిత్వం
పీవీ నరసింహారావు సేవలు, ఆయన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించేలా శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నిత్యసంస్కరణల శీలి అయిన పీవీ... అంధకారంలో ఉన్న దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారని ప్రశంసించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
5. మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
6. రాహుల్‌కు 'షా' సవాల్
చైనాతో సరిహద్దు ఘర్షణపై రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు హోంమంత్రి అమిత్‌షా. ఏఎన్ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. 1962 నుంచి చైనాతో సంబంధాలపై పార్లమెంట్ వేదికగా చర్చిద్దామా? అని సవాల్ విసిరారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
7. ఘర్షణకు ముందే..
చైనా పక్కా ప్రణాళికతోనే గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు తన మార్షల్ ఆర్ట్స్ యోధులను ఆ ప్రాంతాల్లో మోహరించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
8. కచ్చితమైన ఫలితాలు
ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న వేళ.. చైనా నేషనల్ బయోటెక్ ప్రకటన కొత్త ఆశలను చిగురింపజేసింది. తమ వ్యాక్సిన్ కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని చెప్పింది. 1,120 మందిపై వ్యాక్సిన్‌ను ప్రయోగించగా.. వీరందరిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని స్పష్టం చేసింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
9. టాప్‌లేపిన వార్నర్
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో టిక్‌టాక్ వీడియో షేర్ చేశాడు. 'ఇద్దరమ్మాయిలతో' సినిమా నుంచి 'టాప్లేచిపోద్ది' పాటకు వీడియో జత చేసి పోస్ట్ చేశాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
10. వర్మ 'పవన్‌స్టార్'
లాక్‌డౌన్‌లోనూ వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా తన కొత్త సినిమా 'పవర్ స్టార్' అంటూ ప్రకటించాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.