ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్@5PM - LATEST NEWS IN TELUGU

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@5PM
టాప్​టెన్​ న్యూస్@5PM
author img

By

Published : Jun 30, 2020, 4:59 PM IST

1. మరో 5నెలలు ఉచితంగా ఆహార ధాన్యాలు

జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. "ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను నవంబర్​ చివరి వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో 80కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందుతారని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

2. జాతినుద్దేశించి ప్రసంగం

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. వానాకాలం వచ్చిందని, జలుబు, జ్వరం వంటి రకరకాల వ్యాధులు చుట్టుముడతాయని, ఈ సమయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

3. ప్రవేశ పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రవేశ పరీక్షలతో పాటు టైప్ రైటింగ్ వాయిదా వేయాలని కోరుతూ ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ​పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

4. ప్రభుత్వం ఆర్డినెన్స్

రుణపరిమితి పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్‌ చట్టానికి సవరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిమితులకు లోబడి రుణపరిమితిని ఐదు శాతానికి పెంచింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

5. పదవీ విరమణ

రాష్ట్రంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పదవీ విరమణ పొందనున్నారు. వారి స్థానంలో ఇతర ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీజీపీ మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

6. రాగల మూడు రోజులు

రాగల మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

7. గల్వాన్​ వీరులకు సంఘీభావం

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల మధ్య భారత్​కు ఫ్రాన్స్​ అండగా నిలిచింది. ఈ మేరకు భారత రక్షమంత్రి రాజ్​నాథ్ సింగ్​కు ఫ్రాన్స్​ రక్షణమంత్రి ఫ్లోరెన్స్​ పార్లె లేఖ రాశారు. గల్వాన్​ లోయలో అమరులైన 20మంది జవాన్లకు సంఘీభావం తెలుపుతూ.. భారత్​కు సహకారం అందించడానికి ఫ్రాన్స్​ సాయుధ దళాలు ఎప్పుడూ సిద్ధమేనని లేఖలో పేర్కొన్నారు పార్లె. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

8. మార్కెట్లకు నష్టాలు

స్టాక్ మార్కెట్లు వారంలో రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 46 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 10 పాయింట్లు తగ్గింది. హెవీ వెయిట్​ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొనడం నష్టాలకు కారణం. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

9. ఫైనల్‌పై క్రిమినల్‌ దర్యాప్తు

2011 వన్డే ప్రపంచకప్​లో లంక జట్టు అమ్ముడుపోయిందని అప్పటి శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మహీందనంద ఆరోపణలు చేశారు. దీనిని క్రిమినల్ కేసుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు అక్కడి క్రీడా శాఖ సెక్రటరీ రువాన్ చంద్ర. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

10. ఆమిర్ ​ఖాన్​ ఇంట్లో కరోనా

తన సిబ్బందిలో కొంతమందికి కరోనా సోకిందని బాలీవుడ్​ హీరో ఆమిర్​ ఖాన్​ ఇన్​స్టా వేదికగా తెలిపారు. ప్రస్తుతం వారందరినీ క్వారంటైన్​లో ఉంచినట్లు స్పష్టం చేశారు. తనతో పాటు, మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించారని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.