ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్​@5PM - telugu latest news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@5PM
టాప్​టెన్ న్యూస్​@5PM
author img

By

Published : Jun 28, 2020, 4:57 PM IST

1. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌?

కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని సీఎం తెలిపారు. కొద్ది రోజుల్లో లాక్‌డౌన్ విధింపుపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

2. నిజమైన నివాళి

ఇతర దేశాలతో భారత్​ మైత్రి కోరుకుంటుందని, అదే సమయంలో శత్రువులకు సరైన జవాబు చెప్పే సామర్థ్యం దేశానికి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం మనసులో మాట కార్యక్రమాన్ని నిర్వహించిన మోదీ.. సరిహద్దులో భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన వారికి భారత జవాన్లు దీటైన సమాధానమిచ్చారని చైనానుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

3. భారతరత్నతో గౌరవించాలి

సిద్దిపేట కలెక్టరేట్​లో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి హరీశ్​ రావు విజ్ఞప్తి చేశారు. దేశంలో గొప్ప ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినట్టు గుర్తుచేసుకున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

4. కక్షలు కాదు.. విజ్ఞత ప్రదర్శించండి

మంత్రి మల్లారెడ్డి అల్లుడికి ఓట్లు వేయలేదనే... లక్ష్మాపూర్​ గ్రామంపై కక్ష కట్టి, రైతుబంధు పథకం నిలిపివేశారని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. రాజకీయ కక్షలు వదిలేసి... తక్షణమే రైతుబంధు పథకం అమలు చేయాలని ట్వీట్ చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

5. కలెక్టరేట్ల ఎదుట నిరసనలు

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలకు నిరసనగా సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్​ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​లకు వినతి పత్రాలను అందజేస్తామని తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

6. 17 దేశాలకు 170 విమానాలు

కరోనా సంక్షోభ సమయంలో చిక్కుకున్న వారిని తమ స్వస్థలాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందేభారత్​ మిషన్​ నాలుగో దశ త్వరలో ప్రారంభం కానుంది. వచ్చే నెల 5 నుంచి 17వ తేదీ వరకు చేపట్టబోయే ఈ కార్యక్రమంలో 170 ప్రత్యేక విమానాలను విదేశాలకు పంపనుంది ఎయిరిండియా. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

7. ఆసుపత్రి 'చిల్లర' నిర్వాకం

దిల్లీలో కరోనాను జయించిన వృద్ధ దంపతులను బిల్లుపై అదనంగా రూ.1.65 లక్షలు చెల్లించాలని డిమాండ్​ చేశారు ఓ ఆసుపత్రి సిబ్బంది. లెక్క చూపిస్తే బిల్లు చెల్లించేస్తామన్నారు ఆ వయోజనులు. కానీ, చిల్లర ఖర్చులకు లెక్కలుండవన్నారు ఆసుపత్రి నిర్వహకులు. అడిగినంత కట్టకపోతే ఆసుపత్రి నుంచి కదిలేది లేదంటూ.. మంచి నీళ్లు కూడా ఇవ్వకుండా ఇద్దరినీ బంధించారు ఆ ప్రైవేటు సిబ్బంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

8. భారత్​లో మరో ఫ్లాయిడ్

తమిళనాడు ట్యూటికోరిన్​లో తండ్రి, కొడుకుల లాకప్​ డెత్ ఘటన మరువకముందే పోలీసుల మరో దురాగతం బయటపడింది. ఓ ఆటోడ్రైవర్​ను తీవ్రంగా కొట్టగా.. అవయవాలు విఫలమై ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆ రాష్ట్రంలోనే వెలుగుచూసింది. దీంతో రాష్ట్ర పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

9. షెడ్యూల్​ పొడిగించాలి

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ షెడ్యూల్​ను పొడిగించాలని కోరింది బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు. తద్వారా కరోనా వల్ల రద్దయిన ఎనిమిది టెస్టులు అడేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

10. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి.. హీరోయిజంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు బాలీవుడ్​ సూపర్​స్టార్​ షారుఖ్​ ఖాన్​. ఈ సొట్టబుగ్గల కథానాయకుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 28 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు కింగ్ ఖాన్. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.