ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్ @ 5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

TOP TEN NEWS@5PM
టాప్​టెన్ న్యూస్@5PM
author img

By

Published : Jun 25, 2020, 4:59 PM IST

పోరుకు కాంగ్రెస్ సై..

భారత్​లో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలపై ఈనెల 29న దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గల్వాన్​ లోయలో అమరులైన జవాన్లకు శుక్రవారం నివాళులు అర్పించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌.. పీసీసీలకు సూచించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

కాంగ్రెస్​పై ఫైర్!

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్...​ స్వేచ్ఛ గురించి మాట్లాడుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​ రావు ఎద్దేవా చేశారు. జూమ్​ యాప్​ ద్వారా భాజపా నాయకులు, ముఖ్యకార్యకర్తలతో ఆయన మాట్లాడారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

హరితహారంలో పోలీసులు!

మేడ్చల్​ జిల్లా పర్వతాపూర్​లో నిర్మిస్తున్న రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ నిర్మాణ స్థలంలో మంత్రి మల్లారెడ్డితో కలిసి పోలీసులు మొక్కలు నాటారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో పోలీసు శాఖ భాగస్వామ్యం అవుతున్నట్లు డీజీపీ మహేందర్​ రెడ్డి తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఫలితాలేవి?

కరోనా పరీక్షలు చేయించుకున్న 48 గంటల్లో నివేదిక ఇస్తామన్న ప్రభుత్వం.. తన ఐదుగురు అంగరక్షకులు పరీక్షలు చేయించుకుని ఐదు రోజులైనా రిపోర్ట్​ ఇవ్వలేదని గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆరోపించారు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

24 గంటల్లో 22 మంది

బిహార్​లో 24 గంటల వ్యవధిలో పిడుగుపాటుకు గురై 22మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

పరీక్షల రద్దెక్కడ?

కరోనా భయంతో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. అయితే పొరుగు రాష్ట్రం కర్ణాటకలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పే ఎస్​ఎస్​ఎల్​సీ పరీక్షలను రద్దుచేసే అవకాశంలేదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే తగ్గట్లుగానే నేడు పరీక్షలను ప్రారంభించింది. పూర్తి సమచారం కోసం క్లిక్ చేయండి.

బాబాకు వార్నింగ్!

కరోనా ఔషధం పేరిట పతంజలి ఆవిష్కరించిన 'కరోనిల్' అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే ఈ నిషేధం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ ఔషధం నకిలీదని ఆ రాష్ట్ర హోంమంత్రి ఆరోపించారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ముందుగా అందేదెవరికి?

కరోనా వైరస్​పై పోరులో వ్యాక్సిన్​ ఎంతో కీలక పాత్ర పోషించనుందని అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే అనేక దేశాలు దీనిపై తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నాయి. మరి వ్యాక్సిన్​ కొనుగొన్న అనంతరం అది ముందుగా ఎవరికి అందుతుంది? పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

సుశాంత్ చివరి చిత్రం

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ నటించిన చివరి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఆత్మహత్య చేసుకుని అభిమానుల్ని శోకసంద్రంలో ముంచిన ఈ హీరో నటించిన 'దిల్​ బెచారా' జులై 24న విడుదల కానుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

చానుకు అర్జున అవార్డు

భారత మహిళా వెయిట్​ లిఫ్టర్​ సంజిత చానుకు నిలిపివేసిన 2018 నాటి అర్జున అవార్డును ప్రదానం చేయనున్నట్లు స్పష్టం చేసింది క్రీడా మంత్రిత్వ శాఖ. దిల్లీ కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల చానుపై ఉన్న డోపింగ్ ఆరోపణలను​ ఐడబ్ల్యూఎఫ్​ ఉపసంహరించుకోవడమే ఇందుకు కారణం. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.