రూపురేఖలు మారుస్తాం
హైదరాబాద్‌లో పురపాలక శాఖ వార్షిక ప్రగతి నివేదికను ఆ శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. నూతన పురపాలక చట్టం ద్వారా పట్టణాలను మార్చాలన్నదే లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
దౌత్యస్థాయి చర్చలు
సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు బుధవారం భారత్-చైనా మధ్య దౌత్యస్థాయిలో చర్చలు జరిగాయి. భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి(తూర్పు ఆసియా) నవీన్ శ్రీవాస్తవ, చైనా విదేశాంగ శాఖ డైరక్టర్ జనరల్ వూ జియాంగ్వో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఎమ్మెల్యేపై కాల్పులు
రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరోసీలాల్ జాటవ్పై ఓ యువకుడు దాడి చేశాడు. ఎమ్మెల్యే తన ఇంట్లో ప్రజలతో మాట్లాడుతుండగా తుపాకీతో కాల్చాడు. స్వల్పంగా గాయపడిన జాటవ్‌కు ప్రాణాపాయం తప్పింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
కరోనా వినాశక విఘ్నేశుడు
కర్ణాటకలో ఓ యువకుడు వినూత్నంగా వినాయకుని విగ్రహాన్ని రూపొందిస్తున్నాడు. ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా మహమ్మారిని నాశనం చేసే సందేశంతో 'కరోనా సంహారి' గణేశ్ ప్రతిమను తయారు చేస్తున్నాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
బాలభీముడు
నిర్మల్ జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బాల భీముడు జన్మించాడు. మంగళవారం ఓ మహిళ 5.5 కిలోల బరువు కలిగిన మగశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
సర్పంచ్ బలవన్మరణం
స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి సర్పంచ్‌గా గెలిచాడు. ప్రజలందరి మన్ననలతో పాలన సాగిస్తున్నాడు. ఇంతలోనే అతనికెందుకో జీవితంపై విరక్తి కలిగింది. ఎవరికీ చెప్పకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
స్విమ్మింగ్ పూల్‌లో శవాలు
అమెరికాలోని న్యూజెర్సీలో ఘోరం జరిగింది. భారత సంతతికి చెందిన ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు.. వారి పెరట్లోని స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవులుగా కనిపించారు. అయితే ఈ మరణాలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
వరుస లాభాలకు బ్రేక్
లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 561 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 166 పాయింట్లు క్షీణించింది. ఆర్థిక షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మైదానంలో ఇషాంత్
దాదాపు మూడు నెలల తర్వాత ప్రాక్టీసు ప్రారంభించిన బౌలర్ ఇషాంత్ శర్మ.. భౌతిక దూరం పాటిస్తూనే బౌలింగే చేస్తున్నానని రాసుకొచ్చాడు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
సీబీఐ దర్యాప్తు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని నటీనటులు శేఖర్ సుమన్, రుపా గంగూలీ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.