ETV Bharat / state

Telangana News Today: టాప్​న్యూస్ @9AM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​న్యూస్ @9AM
టాప్​న్యూస్ @9AM
author img

By

Published : Jul 19, 2022, 9:00 AM IST

  • చుట్టూ నీళ్లు.. కానీ.. గుక్కెడు మంచినీరు లేదు

వరద ప్రభావం ఆదిలాబాద్ జిల్లాను ఇంకా వీడలేదు. చుట్టూనీళ్లున్నా.. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకడం లేదు. జిల్లాలోని పలు పల్లెల్లో మిషన్ భగీరథ పైపులు ధ్వంసం అవ్వడం వల్ల తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని భూపాలపల్లి, ఆసిఫాబాద్, నల్గొండ వంటి పలు జిల్లాల్లోని గ్రామాల్లో ఇలాంటి దుస్థితే ఉంది.

  • తెలంగాణను కమ్మేస్తున్న క్యాన్సర్

తెలంగాణలో క్యాన్సర్‌ మహమ్మారి అత్యంత వేగంగా కోరలు చాస్తోంది. 2022లో క్యాన్సర్‌ బాధితులు 1,09,433 మంది ఉండగా.. 2030 నాటికి వీరి సంఖ్య 2.08 లక్షలు దాటుతుందని తాజా అధ్యయనం అంచనా వేసింది. అంటే దాదాపు రెట్టింపు అవుతుంది.

  • చీకట్లోనే పల్లెలు.. తాగునీళ్లు లేక తిప్పలు

వారం రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రమంతా అల్లకల్లోలమైపోయింది. వరద ప్రభావం ఇంకా పలు గ్రామాలపై అలాగే ఉంది. చాలా వరకు పల్లెలు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ లేక ఇప్పటికీ చీకట్లోనే గడుపుతున్నాయి. వరద సృష్టించిన బీభత్సంతో కొన్ని గ్రామాల ప్రజలు తాగడానికి మంచినీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద వల్ల పునరావాసాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగి ఇంటికి పయనమవుతున్నారు. తమ ఇళ్లల్లో పరిస్థితిని చూసి గుండెలు బాదుకుంటున్నారు.

  • ఇద్దరు వైద్యులు, వార్డు బాయ్‌ సస్పెన్షన్‌

తీవ్ర గాయాలతో ఆస్పత్రికి వచ్చిన దంపతులకు కుట్లువేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వైద్య సిబ్బందిపై అధికారులు వేటు వేశారు. ఇద్దరు వైద్యులు, వార్జుబాయ్‌ను సస్పెండ్ చేశారు. సిబ్బంది తీరుపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • తెల్లవారిని వణికించిన పోరాట యోధుడు!

విద్య, వైద్యం, భూములను ఎరవేసి మత మార్పిళ్లకు పాల్పడుతున్న తెల్లదొరలు, మిషనరీలను చూసి ఆ ఆదివాసీ యువకుడి రక్తం మరిగింది. తమను జలగల్లా పీల్చుకుతింటున్న పాలకుల తీరుపై ఆయన గుండె రగిలిపోయింది. స్వరాజ్య సాధనే లక్ష్యంగా సాయుధ పోరాటం నడిపిన ఆ విప్లవవీరుడు బ్రిటిష్‌ వారిని వణికించాడు. ఆదివాసీలకు ఆరాధ్య దైవమయ్యాడు. ఆ పోరాట యోధుడే.. బిర్సా ముండా!

  • భారీగా తగ్గిన వంట నూనెల ధరలు..

వంట నూనెల ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో సంస్థలు చర్యలు ప్రారంభించాయి. ఫార్చూన్ బ్రాండ్​పై ఉత్పత్తులు విక్రయించే అదానీ విల్మర్​ రూ.30 మేర తగ్గించింది.

  • మీ పిల్లల్ని తరచూ తలనొప్పి వేధిస్తుందా..

హాయిగా గెంతులేసే పిల్లలు 'అమ్మా' అంటూ తల పట్టుకొని కూలబడితే? ఆటా పాటా మానేసి మంచం మీదికి ఎక్కితే? బడికి వెళ్లనని మారాం చేస్తూ ఇంట్లోనే ఉండిపోతే? ఎప్పుడో అప్పుడంటే ఏమో గానీ తరచూ ఇదే పరిస్థితి ఎదురైతే? తల్లిదండ్రుల మనసు తల్లడిల్లిపోతుంది. ఏమైందోనని కంగారు మొదలవుతుంది. చాలాసార్లు పిల్లల్లో తలనొప్పి మామూలుగా ఉండొచ్చు. కొన్నిసార్లు దీర్ఘకాలమూ వేధించొచ్చు. కొందరిలో హఠాత్తుగా ఉన్నట్టుండి మొదలవ్వచ్చు. ఇది తీవ్ర సమస్యలకూ సంకేతం కావొచ్చు. కాబట్టి నొప్పి ఎలాంటిదైనా కారణమేంటన్నది తెలుసుకోవటం ముఖ్యం.

  • దశాబ్దాల కల నెరవేర్చి.. కప్పు తెచ్చి..

క్రికెట్‌కు పుట్టినిల్లుగా చెప్పుకునే ఇంగ్లాండ్‌.. వన్డే ప్రపంచకప్‌ విజయం కోసం ఎంతో కాలం నిరీక్షించాల్సి వచ్చింది. 1975 మొదలు 2019కి ముందు మూడుసార్లు ఆ జట్టు ఫైనల్‌ చేరినా కప్పు కల తీరలేదు. చివరికి 2019లో విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో మొదట మ్యాచ్‌లో స్కోర్లు సమం.. ఆ తర్వాత సూపర్‌ ఓవర్లో స్కోర్లు సమం.. చివరకు బౌండరీల తేడాతో ఇంగ్లాండ్‌ గెలుపు. మరి ఈ విజయానికి ముఖ్య కారణం ఎవరంటే.. బెన్‌ స్టోక్స్‌. ఫైనల్లో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' ప్రదర్శనతో జట్టుకు మొట్టమొదటి ప్రపంచకప్‌ అందించిన హీరోగా అతను నిలిచిపోయాడు.

  • ఓటీటీలతో నష్టమే.. ఇక మేం మారాల్సిందే

నాగచైతన్య కథానాయకుడిగా, విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థ్యాంక్‌ యూ'. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్​రాజు సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

  • 'చైతూ ఇచ్చిన ఆ జర్క్ అస్సలు​ మర్చిపోలేను'

నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థ్యాంక్‌యూ'. రాశిఖన్నా, మాళవిక నాయర్‌ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో పాల్గొన్న నిర్మాత దిల్​రాజు.. తన కెరీర్​లో హీరో నాగచైతన్య వల్ల ఎదురైన ఓ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. అలానే చైతూ గురించి కొన్ని విషయాలను తెలిపారు. వాటిని తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.