ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News
Telangana Top News
author img

By

Published : Jul 19, 2022, 6:59 AM IST

  • పునరావాస కేంద్రాల్లో దుర్భర పరిస్థితులు

భద్రాద్రి జిల్లాలో పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.ముక్కులదిరే దుర్వాసన మధ్యే ఆవాసం ఉంటున్నారు. పంచాయతీ ట్యాంకర్లే వారికి తాగునీటికి దిక్కయ్యాయి.ఇరుకు గదుల్లో లెక్కకు మించి బాధితులు ఆశ్రయం పొందుతున్నారు

  • వానొస్తే ఆ 4 గ్రామాలకు వణుకే..

వర్షం కురిస్తే కరీంనగర్ జిల్లాలోని ఆ నాలుగు గ్రామాల ప్రజలు వణికిపోతారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తారు. నారాయణపూర్​ చెరువు కట్ట తెగిపోవడంతో.. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గంగాధర్ మండలంలోని ముంపు గ్రామాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

  • పారిశ్రామిక పార్కుల్లో వసతుల లేమి

రాష్ట్రంలోని కొత్త పారిశ్రామిక పార్కుల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణ పనులు ముందుకు సాగక కార్మికులు అగచాట్లు పడుతున్నారు. పారిశ్రామిక వాడల్లోగానీ, వాటికి సమీపాల్లో గానీ నివాస వసతి లేక దూరప్రాంతాల్లో ఉంటూ వ్యయప్రయాసలకోర్చి పనులకు రావాల్సి వస్తోంది.

  • ప్రజలందరికి అమ్మవారి దీవెనలు ఉండాలి

బోనాల పండుగ వెనక ఎంతో చరిత్ర ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. సికింద్రాబాద్​లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని గవర్నర్ దర్శించుకున్నారు. ప్రజలందరికి అమ్మవారి దీవెనలు ఉండాలని తాను కోరుకున్నట్లు ఆమె చెప్పారు.

  • దేశంలో మళ్లీ మంకీపాక్స్​ అలజడి..

దేశంలో మంకీపాక్స్​ అలజడి సృష్టిస్తోంది. తొలి కేసు నమోదైన నాలుగు రోజులకే మరో కేసు వెలుగుచూసింది. కేరళకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి మంకీపాక్స్​ బారిన పడినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు.

  • మరోసారి సుప్రీం మెట్లెక్కిన నుపుర్‌ శర్మ

వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలం సృష్టించిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. తన అరెస్టులపై స్టే విధించాలంటూ ధర్మాసనాన్ని కోరారు.

  • రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు పలు రాష్ట్రాల శాసనసభ్యులు వెల్లడించారు. ఇప్పటికే ముర్ము విజయం ఖాయమనే వార్తలు వినిపిస్తుండగా... తాజాగా ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఎన్​డీఏ అభ్యర్థిని గెలుపునకు మరింత బలం చేకూర్చాయి. తమ పార్టీ విధానాన్ని ధిక్కరించి మరీ ముర్ముకు ఓటు వేసినట్లు పలువురు ఎమ్మెల్యేలు ప్రకటించారు.

  • మీ స్థానంలో పురుషులను ఉద్యోగాలకు పంపండి

తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి మహిళా ఉద్యోగులకు తాలిబన్లు తాజాగా ఓ హుకుం జారీ చేసినట్లు సమాచారం. తమ స్థానంలో బంధువులైన పురుషులను ఉద్యోగాలకు పంపాల్సిందిగా మహిళా ఉద్యోగులకు తాలిబన్లు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు 'ది గార్డియన్‌' వార్తాసంస్థ ఓ కథనంలో పేర్కొంది.

  • కోహ్లీ టైమ్​ దొరికితే నా దగ్గరికి వచ్చేయ్

ఫామ్‌ లేమితో ఇబ్బందిపడుతున్న విరాట్‌ కోహ్లీ గురించి అతడి చిన్నప్పటి కోచ్​ రాజ్‌ కుమార్ శర్మ స్పందించారు. కోహ్లీ ఆటలో ఎటువంటి సమస్య లేదని అన్నారు. కోహ్లీ తన దగ్గరకు మళ్లీ వస్తే.. తప్పిదాలపై తామిద్దరు కలిసి పనిచేస్తామని చెప్పారు

  • ఈ ట్విన్​ సిస్టర్స్​ ఏం చేసినా స్పెషలే!

చింకీ మింకీ.. సోషల్​మీడియాలో యాక్టివ్​గా ఉండే వాళ్లకు వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకున్న కవలల రూపానికి కాస్త సృజనాత్మకత జోడించి సమయ స్ఫూర్తితో కామెడీ చేస్తూ సోషల్​మీడియా స్టార్స్​గా ఎదిగారు. కామెడీ పంచ్​లతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించే ఈ ట్విన్​ సిస్టర్స్​.. లేటెస్ట్​ ఫొటోషూట్​పై ఓసారి లుక్కేద్దాం. అలానే వీరి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.