ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news for 9am
టాప్​టెన్​ న్యూస్​@AM
author img

By

Published : Feb 26, 2021, 9:01 AM IST

భారత్​ బంద్

జీఎస్టీ నిబంధనలను సమీక్షించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ). ఈ నేపథ్యంలో నేడు దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని సీఏఐటీ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భక్తుల రద్దీ

గిరిజన ఆరాధ్యదైవం మేడారం సమ్మక్క, సారమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తున్నారు. రెండో రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మాటల యుద్ధం

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. లక్ష 32 వేలకు పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశామన్న అధికార తెరాస ప్రకటనను విపక్షాలు ఖండించగా.. తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని అధికార పక్షం ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

వంద మందికి పైగా గల్లంతు..!

ఉన్న ఊరిలో ఉపాధి కరవై.. కాయకష్టం చేసి నాలుగు రాళ్లు సంపాదిద్దామని ఏటా ఎంతోమంది కోటి ఆశలతో ఎడారి దేశాలకు వెళ్తున్నారు. తల తాకట్టు పెట్టి అప్పులు చేసి.. ఏజెంట్లను ఆశ్రయించి గల్ఫ్‌కు పయనమవుతున్నారు. అక్కడికి వెళ్లిన కొత్తలో అంతా బాగుందని కుటుంబ సభ్యులతో చెప్పినా.. ఆ తర్వాత కొన్నాళ్లకే వారి నుంచి క్షేమ సమాచారం అందడం లేదు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

తేలేది ఇవాళే..

పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరులో బరిలో నిలిచేదెవరో నేడు తేలనుంది. ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరిరోజు.. ఎంత మంది బరిలో ఉంటారో ఇవాళ తేలిపోతుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కలకలం

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో గుర్తించిన పేలుడు పదార్థాలకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తం అయిన అధికారులు అంబానీ భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

25 లక్షల మంది బలి

కరోనా వైరస్​ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మందిని బలితీసుకుంది. అగ్రరాజ్యం అమెరికాలో 20 శాతం మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పేర్ల నమోదు

దేశంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేస్తోంది. తాజాగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటిన వారిలో ఒకటి కంటే ఎక్కువ జబ్బులతో బాధపడేవారు టీకా పొందేందుకు మార్చి ఒకటో తేదీ నుంచి కొవిన్ యాప్​లో వ్యక్తిగతంగా పేర్లు నమోదు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

స్పిన్ పిచ్

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌.. 112 ఆలౌట్‌. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌.. 145 ఆలౌట్‌. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 0/2. చివరికి 81 పరుగులకు ఆలౌట్‌. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

త్వరలోనే శుభవార్త!

కోలీవుడ్​ హీరో విశాల్​ పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను సింగిల్​గానే ఉన్నట్లు విశాల్​ స్పష్టం చేశారు. వేరొకరితో రిలేషన్​లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనని​.. దేవుడు ఎలాంటి రాత రాస్తే జీవితం అలా కొనసాగుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.