ETV Bharat / state

Telangana Top News టాప్​న్యూస్ 9pm - telangana topten

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9PM TOPNEWS
9PM TOPNEWS
author img

By

Published : Sep 3, 2022, 8:59 PM IST

  • తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే...

ప్రజాస్వామిక తెలంగాణ 75వ వంసంతంలోకి అడుగిడుతున్న వేళ సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. పోడు భూముల అంశంపై సుదీర్ఘంగా చర్చించిన క్యాబినెట్‌ రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. దళిత బంధు పథకాన్ని విస్తరించాలని ప్రతీ నియోజకకవర్గంలో మరో 500 మందికి ఇవ్వాలని నిర్ణయించారు.

  • మునుగోడులో విజయం మనదే: సీఎం కేసీఆర్‌

మునుగోడులో విజయం మనదేనని సీఎం కేసీఆర్‌ తెరాస శాసనసభాపక్ష సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస ఎల్పీ భేటీకి తెరాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు అయ్యారు. మునుగోడులో రెండోస్థానంలో కాంగ్రెస్‌ మూడోస్థానం భాజపా ఉండనుందని కేసీఆర్ ఆకాంక్షించారు. మునుగోడు సర్వేలన్నీ తెరాసకే అనుకూలమని వెల్లండించారు. రెండు గ్రామాలకో ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జిగా నియమిస్తామని తెలిపారు.

  • తెలంగాణకు కేంద్రం ఏమీ చేయట్లేదనటం అవాస్తవం

Nirmala Sitharaman: తెలంగాణకు కేంద్రం ఏమీ చేయట్లేదనడం అవాస్తవమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొననారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రాష్ట్రాలకు నిధులిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఇష్టమున్న రాష్ట్రానికి ఎక్కువ నిధులు ఇవ్వటమనేది కుదరదని తెలిపారు. హైదరాబాద్‌ భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్‌ కేంద్రం వసూలు చేసిన సెస్సుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ ఇచ్చామని తేల్చిచెప్పారు.

  • మరో 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ

తెలంగాణలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ విభాగాల్లో 1,540 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 22 నుంచి అక్టోబర్‌ 14వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది.

  • దిల్లీకి నితీశ్​.. ప్రతిపక్షాలను కూడగట్టడమే లక్ష్యం

Nitish Kumar Opposition : బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్​ కుమార్​ ఈ నెల 5న దిల్లీలో పర్యటించనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలను కలవనున్నారు.

  • అధికారుల నిర్లక్ష్యం.. పదుల సంఖ్యలో పక్షుల మృత్యువాత

Tree Cutting Kerala : అధికారుల నిర్లక్ష్యం పదుల సంఖ్యలో పక్షులు మరణించేలా చేసింది. రోడ్డు విస్తరణలో భాగంగా పక్కనే ఉన్న చెట్టును యంత్రంతో ఒక్కసారిగా కొట్టేశారు. దీంతో చెట్టుపై ఆశ్రయం పొందుతున్న వందలాది పక్షులు కింద పడి ఆ దెబ్బలకు మరణించాయి.

  • విమానంతో ఢీకొడతానని వాల్​మార్ట్​కు బెదిరింపు

Walmart Plane Crash : విమానంతో వాల్‌మార్ట్‌ స్టోర్‌ను ఢీకొంటానని ఓ పైలట్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. చిన్న విమానంతో ఆ స్టోర్‌ చుట్టూ ఆకాశంలో చక్కర్లు కొట్టాడు. ఈ ఘటన అమెరికా మిసిస్సిపీ రాష్ట్రంలోని టుపెలోలో జరిగింది.

  • ప్రపంచకప్​కు స్టార్​ ఆల్​రౌండర్​ డౌటే!

Jadeja Ruled Out : టీ-20 వరల్డ్​కప్​కు ముందు టీమ్​ ఇండియాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆసియా కప్​కు దూరమైన భారత స్టార్​ ఆల్​రౌండర్​ కీలక టీ-20 ప్రపంచకప్​కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది.

  • కేతిక శర్మ చేసిన పనికి అలా ట్వీట్​ చేసిన దేవీ శ్రీ

దేవీ శ్రీ ప్రసాద్.. ఈ పేరుకు ఉన్న క్రేజే వేరు. తన మ్యూజిక్​తో సంగీత ప్రియులను ఊర్రూతలూగిస్తుంటారు. ఆయన పాటకు, సంగీతాన్ని ఫిదా అవ్వని వారుండరు. అయితే తాజాగా ఆయన ఓ యంగ్​ హీరోయిన్ పాటకు ఫిదా అయిపోయారు. ఎవరంటే..

  • పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన రష్మి.. కానీ ఓ ట్విస్ట్​..

Anchor rashmi marriage జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్​గా కెరీర్ ప్రారంభించి యూత్​లో క్రేజ్​ సంపాదించుకుంది రష్మి. అలానే అవకాశం దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొత్తంగా తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ.. స్టేజిపై గ్లామర్ ఒలికిస్తూ సూపర్​ ఫ్యాన్ ఫాలోయింగ్​ను పెంచుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.