ETV Bharat / state

టాప్​ న్యూస్@1PM​

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS AT 1PM
టాప్​ న్యూస్@1PM​
author img

By

Published : Aug 14, 2020, 12:55 PM IST

  • మోదీ రికార్డు: సుదీర్ఘ కాలం ప్రభుత్వ అధినేతగా

ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు సృష్టించారు. అత్యధిక కాలం ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ప్రధానిగా కీర్తి గడించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 12 ఏళ్లతో పాటు మొత్తం 18 సంవత్సరాల 306 రోజుల పాటు ప్రభుత్వానికి అధ్యక్షత వహించారు మోదీ. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాలు మోదీ తర్వాతి స్థానంలో ఉన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • అనాథ బాలిక మృతి కేసు: నిందితుల కస్టడీకి పిటిషన్ దాఖలు​..

అనాథ బాలిక మృతి కేసులో పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని అమీన్​పూర్​ పోలీసులు కోరారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్​... అలసత్వం వహిస్తే షోకాజ్ నోటీస్​

మార్నింగ్ వాక్ కోసం ఎక్కడికి వెళ్తాం? దగ్గర్లో ఉన్నక్రీడా మైదానానికో... సమీపంలోని వాకింగ్ ట్రాక్ కో వెళ్తాం. కాని ఆ కలెక్టర్ మాత్రం మార్నింగ్ వాక్ కోసం దగ్గర్లోని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, గ్రామాలకు వాహనంలో వెళ్లి అక్కడ మార్నింగ్ వాక్ చేస్తారు. మార్నింగ్ వాక్ చూస్తూనే అక్కడి హరితహారం, పారిశుద్యం, పల్లె,పట్టణ ప్రగతి పనులను పరిశీలిస్తారు. ఆకస్మికంగా అభివృద్ధి పనులను తనిఖీ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటే సరి. లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. ఇంతకీ ఎవరా కలెక్టర్ అని ఆలోచిస్తున్నారా? అయితే క్లిక్​ చేయండి

  • భాగ్యనగరంలో 90 శాతానికి పైగా ఆసుపత్రులు అనధికారికమే..

అడుగు పెట్టడమే ఆలస్యం.. రకరకాల పరీక్షల పేర్లు చెప్పి జేబులు గుల్ల చేసే కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాహకులు.. వివిధ శాఖల అనుమతులు తీసుకోమంటే మాత్రం ససేమిరా అంటున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) నుంచి సీఎఫ్‌వో, సీఎఫ్‌ఈ తీసుకోకుండా 90 శాతం ఆసుపత్రులు ముఖం చాటేస్తున్నాయి. పీసీబీ అధికారులు నోటీసులు జారీ చేసి మమ అనిపిస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • రంగులు చెప్పండి.. లక్షలు గెలవండి!

చిత్రంలో రంగులెలా ఉంటే బాగుంటాయి? తర్వాతి రంగు ఏది వస్తుందో చెప్పండి? రూ.లక్షలు గెలుచుకోండి.. అంటూ దిల్లీ కేంద్రంగా అంతర్జాలంలో పందేలు నిర్వహిస్తూ రూ.వందల కోట్లు లాగేస్తున్న చైనా కంపెనీల ప్రతినిధులను నలుగుర్ని అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • భర్తను చంపి ముక్కలుగా నరికి.. సంచిలో!

కట్టుకున్నవాడినే కడతేర్చి.. శరీరాన్ని ముక్కలుగా చేసి గోనె సంచిలో కట్టిపడేసింది ఓ కిరాతక భార్య. ఇద్దరు సోదరీమణులు, ఓ స్నేహితుడితో కలిసి ఇంతటి ఘాతుకానికి పాల్పడింది. ఇప్పుడు రాజస్థాన్ పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • రాజస్థాన్ బలపరీక్ష: అసెంబ్లీ మధ్యాహ్నానికి వాయిదా

గత కొన్ని రోజులుగా రాజకీయంగా సెగలు పుట్టించిన రాజస్థాన్‌ రాజకీయాలు చివరి మజిలీకి చేరుకున్నాయి. అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ విశ్వాస పరీక్షకు సిద్ధం కాగా.. ప్రతిపక్ష భాజపా అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించింది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భాజపా నేత వసుంధరా రాజే గవర్నర్‌ను కలిశారు. పూర్తివివరాలకై క్లిక్​ చేయండి

  • కమలా హ్యారిస్​పై ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్​ మూలాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అమెరికాలో పుట్టలేదని విన్నానని, శ్వేతసౌధానికి సేవ చేసే అర్హత ఆమెకు లేదని నిపుణులు ఆరోపిస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఐపీఎల్ మధ్యలో ఆటగాడికి కరోనా వస్తే?

త్వరలో ఐపీఎల్ మొదలు కానున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తి విషయంలో బీసీసీఐ ఎలాంటి చర్యలు తీసుకోనుందనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. మ్యాచ్​ మధ్యలో ఆటగాడికి కరోనా సోకినట్లు తేలితే ఏం చేస్తారనే ప్రశ్నలూ వస్తున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • వాటిని అసలు పట్టించుకోను: రామ్​గోపాల్ వర్మ

'థ్రిల్లర్' సినిమా విడుదల సందర్భంగా పలు విశేషాలు చెప్పిన డైరెక్టర్ వర్మ.. తనపై వార్తల్ని పట్టించుకోనని అన్నారు. శరవేగంగా విస్తరిస్తున్న ఓటీటీలకు సెన్సార్​ చేయడం అసాధ్యమైన పని అని తెలిపారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.