- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి
వనపర్తి రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో విషాదం. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం గ్రామంలో కలకలం రేపింది. ఇంట్లో వేర్వేరు చోట్ల నలుగురి మృతదేహాలను గుర్తింపు పోలీసులు గుర్తించారు. మృతులు తల్లి ఆజీరాం బీ (63), కుమార్తె ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనుమరాలు హసీనా (10) పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలకై క్లిక్ చేయండి
- కరోనా విలయ తాండవం.. 1921 కొత్త కేసులు.. 9 మంది మృతి
రాష్ట్రంలో కొత్తగా 1,921 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 9 మరణాలను వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 88,396కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కొవిడ్‌తో 674 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి కోలుకుని మరో 1,210 మంది డిశ్చార్జయ్యారు. పూర్తివివరాలకై క్లిక్ చేయండి
- గ్రామస్థులే అమ్మానాన్నై... వివాహం జరిపించారు..
తల్లీతండ్రి లేని ఆ నిరుపేద యువతికి పెళ్లి చేసేందకు మండలంలోని చిల్పకుంట్ల గ్రామస్థులు పెద్దమనసుతో ముందుకొచ్చారు. తలొకరు చేతనైనంత ఆర్థికసాయాన్ని అందించి పెళ్లి చేశారు. మానవత్వానికి చిరునామా గల్లంతైందని భావించేవారికి ఈ వివాహ వేడుకే పెద్ద సమాధానం. పూర్తివివరాలకై క్లిక్ చేయండి
- మహారాష్ట్రకు రాబందులు వలస.. మన దగ్గర మిగిలినవి 10-12 మాత్రమే!
తెలుగు రాష్ట్రాల్లో రాబందులు కనుమరుగవుతుండడం పర్యావరణ నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా తెలంగాణాలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం పాలరాపుగుట్టలో ఒకట్రెండేళ్ల క్రితం 35-37 రాబందులు ఉండగా.. ఇప్పడు 10-12 మాత్రమే మిగిలాయి. పూర్తివివరాలకై క్లిక్ చేయండి
- కరోనా విజృంభణ: 64,553 కేసులు, 1007 మరణాలు
దేశంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రమవుతోంది. కొత్తగా 64,553 మంది మహమ్మారి బారినపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24లక్షల 61వేల 191కి చేరింది. ఇప్పటివరకు మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 2 కోట్ల 76 లక్షల 94 వేలకు చేరింది. పూర్తివివరాలకై క్లిక్ చేయండి
- 'రష్యా వ్యాక్సిన్‌కు అన్ని పరీక్షలు జరగలేదు'
రష్యా ఆమోదించిన కరోనా వ్యాక్సిన్ చివరి దశ ప్రయోగాలు చేసి పరీక్షించింది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుతం తొమ్మిది టీకాలు మాత్రమే తుది పరీక్షల దశలో ఉన్నాయని, అందులో రష్యా వ్యాక్సిన్ లేదని స్పష్టం చేసింది. అయితే దీనిపై పూర్తి అవగాహన కోసం రష్యా నుంచి సమాచారాన్ని కోరినట్లు వెల్లడించింది. పూర్తివివరాలకై క్లిక్చేయండి
- పల్లెపట్టులకేదీ ఉపాధి భరోసా?
ప్రజల జీవన గమనాన్ని కరోనా కకావికలం చేసింది. చాలా మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ ప్రభావంవల్ల నిరుద్యోగిత పెచ్చుమీరింది. అన్ని రంగాలూ పడకేసిన ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయమే దేశ పునరుజ్జీవానికి ఆశాకిరణంలా మారింది. కొవిడ్ ఉత్పాతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)- కార్మికులకు అక్కరకొచ్చే అద్భుతమైన సాధనం! ఈ కార్యక్రమం కింద పేదలకు పనితోపాటు- వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి అవసరమైన ఆస్తుల కల్పన సైతం సాధ్యపడుతుంది. పలు అధ్యయనాలు సైతం ఇవే విషయాలు స్పష్టీకరిస్తున్నాయి. పూర్తివివరాలకై క్లిక్ చేయండి
- లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 130 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం 38,443 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సైతం లాభాల్లోనే పయనిస్తోంది. 34 పాయింట్లు వృద్ధి చెంది, 11,335 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ధోనీ హెలికాప్టర్ షాట్లు ఏడేళ్ల అమ్మాయి కొడితే
ధోనీలా హెలికాప్టర్ షాట్లు కొడుతున్న ఏడేళ్ల చిన్నారి వీడియోను ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఆట చూసి ఆమెకు అభిమానిగా మారిపోయినట్లు చెప్పాడు. పూర్తివివరాలకై క్లిక్ చేయండి
- 'సుశాంత్ సింగ్‌తో ఆ రోజు డ్యాన్స్ ఎంతో ప్రత్యేకం'
సుశాంత్ సింగ్‌తో గతంలో డ్యాన్స్ చేసిన వీడియోను పంచుకున్నాడు నటుడు సిద్ధాంత్ చతుర్వేది. అతడి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నానని తెలిపాడు. పూర్తివివరాలకై క్లిక్ చేయండి