ETV Bharat / state

జోరందుకున్న ప్రచారం... రంగంలోకి అగ్రనేతలు

హుజూర్​నగర్ ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అగ్రశ్రేణి నేతలంతా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కేటీఆర్, ఉత్తమ్, కోదండరామ్, ఎల్.రమణ... ఇలా ముఖ్య నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన కోదండరామ్ సైతం ప్రచారంలో పాల్గొన్నారు.

TOP LEADERS IN HUZURNAGAR BY ELECTIONS CAMPAIGN
author img

By

Published : Oct 5, 2019, 6:03 AM IST

హుజూర్​నగర్ నియోజకవర్గంలోని పల్లెలు ప్రచారాలతో హోరెత్తుతున్నాయి. అగ్రనేతల దృష్ట్టంతా... ఇప్పుడు ఉప ఎన్నికలపైనే ఉంటోంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తెజస అధ్యక్షుడు కోదండరామ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నియోజకవర్గ కేంద్రంలో పర్యటిస్తే... సతీమణితో కలిసి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి హుజూర్​నగర్ మండలంలో ఓటర్లను కలుసుకున్నారు.

తెరాసపై కోదాండరామ్​ విమర్శలు...

గత పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు కోల్పోవటం వల్ల... తెరాసలో అంతర్మథనం మొదలైందని కోదండరామ్ వ్యాఖ్యానించారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో అది పునరావృతమైతే... ప్రభుత్వం సమర్థంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

ప్రచార బరిలో అగ్రనేతలు...

తెరాస ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జగదీశ్​రెడ్డి... సైదిరెడ్డిని గెలిపించాలంటూ పార్టీ శ్రేణులకు సూచించారు. లీడర్​ను, కేడర్​ను సమన్వయం చేయటమే ఇంఛార్జిల కర్తవ్యమన్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సైతం... పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి కిరణ్మయిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. తన సతీమణి పద్మావతిని గెలిపించాలంటూ ఉత్తమ్... పలు గ్రామాల్లో పర్యటించారు. తనను గెలిపిస్తే రూ. వంద కోట్లతో హుజూర్​నగర్​ను అభివృద్ధి చేస్తానంటూ... భాజపా అభ్యర్థి రామారావు హామీ ఇస్తున్నారు. ఇలా ముఖ్య నేతల రాక, అభ్యర్థుల పర్యటనలతో... హుజూర్​నగర్ ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంది.

జోరందుకున్న ప్రచారం... రంగంలోకి అగ్రనేతలు

ఇవీ చూడండి: నేటి నుంచి ఆర్టీసీ సమ్మె... ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.