ETV Bharat / state

krmb: తుపాను ప్రభావం.. కేఆర్‌ఎంబీ ఉపసంఘం సమావేశం వాయిదా

krmb meeting cancelled
కేఆర్‌ఎంబీ ఉపసంఘం సమావేశం వాయిదా
author img

By

Published : Sep 27, 2021, 6:24 PM IST

Updated : Sep 27, 2021, 6:55 PM IST

18:22 September 27

krmb: తుపాను​ ప్రభావం.. కేఆర్‌ఎంబీ ఉపసంఘం సమావేశం వాయిదా

     గులాబ్​ తుపాను ప్రభావంతో కేఆర్​ఎంబీ ఉపసంఘం సమావేశం వాయిదా పడింది. రేపు జరగాల్సిన భేటీని రద్దు చేస్తున్నట్లు కేఆర్​ఎంబీ ప్రకటించింది. గతంలో హైదరాబాద్​లోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం సమావేశమైంది.

పది రోజుల్లో వివరాలు ఇవ్వండి

    కృష్ణాబోర్డు సభ్యుడు ఆర్​.కె.పిళ్లై కన్వీనర్​గా ఉపసంఘం చర్చలు జరుపుతోంది. ప్రాజెక్టుల నిర్వహణ వివరాలు ఇవ్వాలని గత సమావేశంలో రెండు రాష్ట్రాలను కేఆర్ఎంబీ కోరింది. గతంలో జరిగిన సమావేశంలో 10 రోజుల్లోగా వివరాలివ్వాలని స్పష్టం చేసింది. రూ.కోటికి పైగా విలువ ఉన్న కాంట్రాక్టుల వివరాలు సమర్పించాలని పేర్కొంది. అన్ని అంశాలు పూర్తయ్యాక సీఆర్పీఎఫ్‌పై చర్చ ఉంటుందని వెల్లడించింది. బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ బోర్డు పరిధిలోకి రాదని ఏపీ వాదించింది. బానకచర్ల కూడా బోర్డు పరిధిలోనే ఉండాలని తెలంగాణ స్పష్టం చేసింది. ఈ విషయంపై అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తామని ఉప సంఘం కన్వీనర్ పిళ్లై తెలిపారు.  

కేంద్రం గెజిట్ అమలుపై ఉపసంఘం

  గెజిట్​ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ ఖరారుపై ప్రస్తుతం ఉపసంఘం చర్చలు జరుపుతోంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన సమాచారం, వివరాలు, సంబంధిత అంశాలపై కేఆర్​ఎంబీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ ఉప సంఘాల మొదటి సమావేశం ఇటీవలే హైదరాబాద్​లోని జలసౌధలో జరిగింది. బోర్డు సభ్యులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, జెన్​కో అధికారులు ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. 

ఇదీ చూడండి: KRMB: 10 రోజుల్లోగా ప్రాజెక్టుల నిర్వహణ వివరాలు ఇవ్వాలి : కేఆర్ఎంబీ

Last Updated : Sep 27, 2021, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.