పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, బీ-ఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఈ-సెట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు జేఎన్టీయూహెచ్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నెల 3న జరిగిన ఈ-సెట్‌కు సుమారు 24 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఈ నెల 24 నుంచి ఈ-సెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 24 నుంచి 28 వరకు స్లాట్ బుకింగ్, 26 నుంచి 29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 26 నుంచి 31 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. సెప్టెంబరు 2న ఈ-సెట్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తారు.
సెప్టెంబరు 2 నుంచి 7 వరకు విద్యార్థులు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెప్టెంబరు 13న ఈ-సెట్ తుది విడత ప్రవేశాల షెడ్యూల్ ప్రారంభం కానుంది. 14న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. సెప్టెంబరు 14, 15 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. సెప్టెంబరు 17న తుది విడత ఈ-సెట్ సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 18 నుంచి 20 వరకు విద్యార్థులు కాలేజీల్లో చేరాలని ప్రవేశాల కమిటీ ఛైర్మన్, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. సెప్టెంబరు 18న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: corona cases: రాష్ట్రంలో కొత్తగా కేసులు, 2 మరణాలు నమోదు