గవర్నర్ కోటా కింద నియమాకమైన నూతన ఎమ్మెల్సీలు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్సీలు గోరెటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ రేపు ఉదయం పది గంటలకు ప్రమాణం చేయనున్నారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబరులో కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించనున్నారు.
గోరెటి వెంకన్న నియామకంతో మండలిలో ఎస్సీ సభ్యుల సంఖ్య నాలుగుకు చేరింది. సారయ్య నియామకంతో బీసీ ఎమ్మెల్సీల సంఖ్య తొమ్మిదికి చేరింది. మండలిలో తొలి ఆర్యవైశ్య సభ్యునిగా దయానంద్ గుర్తింపు పొందారు.
ఈ ముగ్గురు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే జీహెచ్ఎంసీలో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోనున్నారు. నూతన ఎమ్మెల్సీల నియామకంతో మండలిలో మొత్తం 40 స్థానాలు భర్తీ అయినట్లైంది. తెరాస నుంచి 35 మంది, మజ్లిస్ నుంచి ఇద్దరు, ఉపాధ్యాయ, కాంగ్రెస్, భాజపా నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదీ చదవండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?