ETV Bharat / state

మొన్న మహేశ్, అడవి శేష్.. నేడు నాగార్జున.. ఆ రేస్‌ కోసం వెయిటింగ్!

Formula E racing in Hyderabad : భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా ఫార్ములా ఈ-రేసింగ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ రేసింగ్‌కు హైదరాబాద్ వేదిక కాబోతోంది. ఈ రేసింగ్‌పై మొన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ హీరో అడివి శేష్ స్పందించారు. నేడు టాలీవుడ్ కింగ్ నాగార్జున సైతం రియాక్ట్ అయ్యారు. ఈ-రేసింగ్‌కు హైదరాబాద్ వేదిక కావడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ ఈవెంట్‌ను వీక్షించడానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెబుతూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.

tollywood
మొన్న మహేశ్, అడవి శేష్.. నేడు నాగార్జున.. ఆ రేస్‌ కోసం వెయిటింగ్!
author img

By

Published : Jan 27, 2023, 4:27 PM IST

Formula E racing in Hyderabad : ఇండియాలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ- రేసింగ్ ఈవెంట్​ జరగనుంది. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఈవెంట్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల మేర ట్రాక్​పై ఈవెంట్ జరగనుంది. ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

ఈవెంట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా మహింద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా, సీఈఓ దిల్ బాగ్ గిల్, అధికారులు, బ్రాండ్ అంబాసిడర్లు, నిపుణులు ఉంటారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎక్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఎక్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా హైదరాబాద్ సీపీ, పోలీసు, ఆర్ అండ్ బీ, పురపాలక, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

Nagarjuna reaction Formula E racing: ఫార్ములా ఈ రేసింగ్‌పై టాలీవుడ్ కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేశారు. దానిని మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇక నాగార్జున మాట్లాడుతూ... ఇండియాలో మొదటి సారిగా జరుగుతున్న ఫార్మూలా ఈ రేసింగ్‌‌కు హైదరాబాద్ అతిథ్యం ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్‌, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టిలకు థ్యాంక్స్ చెప్పారు. ఈ రేస్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

mahesh babu reaction Formula E racing : ఇక ఫార్ములా ఈ రేసింగ్‌పై మొన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశారు. మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఇండియాలో మొదటి సారిగా జరుగుతున్న ఫార్మూలా ఈ రేసింగ్‌‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఓ గొప్ప విషయం. ఓ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన కేటీఆర్‌కు, అనిల్ చలమలశెట్టికి శుభాకాంక్షలు. ఫిబ్రవరి 11న జరుగునున్న ఈ రేసు పోటీలను చూడటానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అని మహేశ్ బాబు అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Adivi sesh reaction Formula E racing : ఫార్ములా ఈ-రేస్‌పై టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ కూడా స్పందించారు. ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ వేదిక కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌కు ఈ ఘనత తీసుకొస్తున్న మంత్రి కేటీఆర్, గ్రీన్ కో అనిల్ చలమలశెట్టి, తెలంగాణ ప్రభుత్వానికి శేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ ఈవెంట్‌లో తాను తప్పక పాల్గొంటానని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.