ETV Bharat / state

Tollywood drugs case : ముగిసిన రానా విచారణ.. కెల్విన్​తో లావాదేవీలపై ఈడీ ఆరా - tollywood drugs case updates

ed inquiry on rana in drugs case
మనీలాండరింగ్‌ కేసులో ముగిసిన రానా విచారణ
author img

By

Published : Sep 8, 2021, 6:10 PM IST

Updated : Sep 8, 2021, 8:18 PM IST

18:08 September 08

మనీలాండరింగ్‌ కేసులో ముగిసిన రానా విచారణ

తెలుగు చిత్ర సీమలో సంచలనం సృష్టిస్తున్న మాదకద్రవ్యాల కేసు(TOLLYWOOD DRUGS CASE)లో ఎన్​ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ENFORCEMENT DIRECTORATE)(ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు 7 గంటలపాటు సినీనటుడు దగ్గుబాటి రానా(DAGGUBATI RANA)ను విచారించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్(KELVIN)​ను ఈడీ అధికారులు మరోసారి కార్యాలయానికి పిలిపించి విచారించారు. నిన్న సుదీర్ఘంగా కెల్విన్​ను ప్రశ్నించిన అధికారులు... ఈ రోజు రానా, కెల్విన్​ను వేర్వేరుగా ప్రశ్నించారు.  

కెల్విన్​ ఎవరో తెలీదు.. 

మనీలాండరింగ్ కేసు(MONEY LAUNDERING)లో ఈడీ నోటీసులు అందుకున్న రానా... ఇవాళ అధికారుల ఎదుట హాజరయ్యారు. రానా బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు... కెల్విన్‌తో లావాదేవీలపై ఆరా తీశారు. తనకు కెల్విన్​ ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. అయితే మనీ లాండరింగ్‌ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి.. అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ క్లబ్ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.  

వివరాల సేకరణ

ఇప్పటికే డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్​కు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు... మత్తుమందు సరఫరాదారులు కెల్విన్, వాహిద్​తో పాటు మరో వ్యక్తిని మంగళవారం ప్రశ్నించారు. ఈ రోజు మళ్లీ 8 గంటలుగా కెల్విన్, వాహీద్‌ను అధికారులు ప్రశ్నించారు. ఇద్దరి బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలు సేకరించారు. రేపు మరోసారి విచారించే అవకాశం ఉంది. 

రేపు విచారణకు రవితేజ

రేపు ఈడీ విచారణకు సినీ నటుడు రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్ హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్​, ఛార్మి, రకుల్​, నందులను విచారించిన అధికారులు.. వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.

ఇదీ చదవండి: Tollywood Drugs case : నందును 7 గంటలు, కెల్విన్‌ను 6 గంటల పాటు విచారించిన ఈడీ

Last Updated : Sep 8, 2021, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.