Toll plazas sankranthi revenue 2022 : సంక్రాంతి సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగించడంతో టోల్‌ప్లాజాలకు భారీగా ఆదాయం సమకూరింది. రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు వెళ్లేందుకు పలు జాతీయ రహదారులను దాటాలి. ఆయా జాతీయ రహదారులపై రాష్ట్ర పరిధిలోని 28 ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలున్నాయి. గడిచిన ఏడాదితో పోలిస్తే ఈ దఫా రాకపోకలు అధికంగా జరిగాయి. పండుగ మూడు రోజుల్లో గడిచిన ఏడాది టోల్‌గేట్ల వద్ద 6.26 లక్షల లావాదేవీలు జరగ్గా ఈ ఏడాది ఆ సంఖ్య 7.55 లక్షలకు చేరింది. ఒక్క హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలోని టోల్‌ప్లాజాల వద్ద 3.78 లక్షల లావాదేవీలు జరిగాయి. మొత్తం ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది రూ.11.72 కోట్ల ఆదాయం లభించింది. గడిచిన ఏడాది రూ.9.49 కోట్లు వచ్చింది. ఈ ఏడాది ఫాస్టాగ్ వినియోగం 97.36 శాతంగా ఉంది. గడిచిన ఏడాదిలో ఇది 81.36 శాతం.

సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సుల ద్వారా 55 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేసినట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7 నుంచి 17 వరకు మొత్తం రూ.107 కోట్ల ఆదాయం సమకూరగా 17వ తేదీన అత్యధికంగా రూ.12.21 కోట్లు లభించినట్లు వివరించారు.
ఇదీ చదవండి: online classes effect on eyes: ఆన్‌లైన్ తరగతులతో కళ్లపై ఒత్తిడి.. ఆరేడేళ్లకే అద్దాలు తప్పనిసరి!