ETV Bharat / state

Telangana Assembly Sessions 2021: ఉభయసభల్లో నేడు చర్చించే అంశాలివే.. - శాసనసభ సమావేశాలు 2021

నేడు శాసనసభలో దళితబంధు పథకంపై... మండలిలో మైనార్టీల సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధిపై చర్చ జరగనుంది. అనంతరం శాసనసభ వర్షాకాల సమావేశాలను పొడిగించాలనే అంశంపై నేడు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Telangana Assembly Sessions 2021
శాసనసభ సమావేశాలు 2021
author img

By

Published : Oct 5, 2021, 6:48 AM IST

దళితబంధు పథకం (Dalitha Bandhu Scheme)పై ఇవాళ శాసనసభ (Telangana Assembly Session)లో చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల అనంతరం దళితబంధుపై స్వల్పకాలిక చర్చ చేపడతారు. మైనార్టీల సంక్షేమం, పాతబస్తీలో అభివృద్ధిపై మండలిలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. సోమవారం అసెంబ్లీ ఆమోదించిన జీఎస్టీ చట్టసవరణ బిల్లు, టౌటింగ్ చట్టం బిల్లుపై నేడు మండలిలో చర్చ చేపడతారు. టౌటింగ్​ చట్టం బిల్లు గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం, వైకుంఠధామాలు - డంపింగ్ యార్డుల నిర్మాణం, ఆరోగ్యలక్ష్మి పథకం అమలు, వాగులపై చెక్ డ్యాంలు, ఆరోగ్య వివరాల రికార్డులు, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ వంటి తదితర అంశాలు శాసనసభ (Telangana Assembly Session) ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి. మెగా డెయిరీ ప్రాజెక్టుల ఏర్పాటు, కళాకారులకు పింఛన్లు, ఎస్సార్డీపీ పనులు, పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం, ఆదిలాబాద్ జిల్లాలో పర్యాటకాభివృద్ది, ప్రాంతీయ వలయరహదారి ప్రాజెక్టులు మండలి ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి.

సమావేశాల పొడిగింపు..!

శాసనసభ వర్షాకాల సమావేశాల (Telangana Assembly Session)ను పొడిగించనున్నారు. ఈ నెల అయిదో తేదీ వరకే జరపాలని గత నెల 24న జరిగిన సభాకార్యకలాపాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత భారీ వర్షాల వల్ల సభకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చారు. దీంతో తాజాగా పొడిగింపు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో సభ (Telangana Assembly Session)ను ఎన్నిరోజులు కొనసాగించాలనే దానిపై ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. బీఏసీ సమావేశం లేదా సభాపక్ష నేతలతో చర్చించి, సభాపతి తమ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: telangana assembly session: రెండు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసిన శాసనసభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.