TS Weather Report: ఎండవేడిమి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ వాసులకు వరుసగా రెండోరోజు కాస్త ఊరట కలిగింది. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. సోమాజిగూడ, రాజ్‌భవన్, అమీర్‌పేట్, బేగంపేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు. ఉపరితల ద్రోణి రాష్ట్రం నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతుందని సంచాలకులు వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం, వికారాబాద్, తాండూరులో భారీవర్షం పడింది. అప్పుడప్పుడు కురుస్తున్న వానలతో.. భానుడి ప్రతాపం నుంచి రాష్ట్రవాసులకు కాస్త ఉపశమనం లభిస్తోంది.
ఇదీ చదవండి: గ్రూపు- 1, 2కి ఒకేసారి ప్రిపేర్ అవ్వండిలా... జాబ్ పక్కా మీదే!
4 రోజుల్లో 3 భేటీలు.. 6 రాష్ట్రాలకు 'పీకే' స్కెచ్ రెడీ.. రాహుల్‌కు ఓకే.. కానీ...