Telangana Weather report today: రాష్ట్రంలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in Telangana) అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణం(weather report in Telangana) ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. కింది స్థాయి గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొన్నారు.
ఈరోజు ఉదయం అందిన వాతావరణ విశ్లేషణ ఆధారంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ శ్రీలంక వైపునకు వెళ్లిపోయిందన్నారు. ఈ నెల 29వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ అల్పపీడనం బలపడి తదుపరి 48గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని సంచాలకులు వివరించారు.
ఇదీ చదవండి:
Annamayya Reservoir Disaster: తెగిన మట్టికట్ట... గూడు పోయి గోడు మిగిలింది..