ETV Bharat / state

Weather Report: రాష్ట్రంలో తగ్గిన చలి తీవ్రత... రాగల మూడు రోజులు వర్షాలు - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో నేడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు(rains latest news) కురుస్తాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం(hyderabad weather report) వెల్లడించింది. రాగల మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు (rains in telangana) కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

Weather Report
Weather Report
author img

By

Published : Nov 15, 2021, 3:48 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(hyderabad weather report) ప్రకటించింది. ఈరోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు(rains latest news) పడతాయని తెలిపింది. కిందిస్థాయి గాలులు రాష్ట్రం వైపునకు తూర్పు దిశ నుంచి వీస్తున్నాయని వాతావరణ శాఖ సంచాలకురాలు తెలిపారు. నిన్నటి అల్పపీడనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో దాని అనుబంధ ఉపరితల ఆవర్తనంతో పాటు... ఉత్తర అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తూర్పు-మధ్య అండమాన్ సముద్రం దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం వుందని వాతావరణ సంచాలకులు(hyderabad weather report) వివరించారు. తదుపరి ఇది ఇంచుమించు పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్‌- ఉత్తర తమిళనాడు తీరం వద్దనున్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలకు ఈ నెల 18న చేరే అవకాశం ఉందని వెల్లడించారు.

సాధారణంకన్నా 7 డిగ్రీలు అదనం...

తూర్పు భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని(hyderabad weather report) వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 7 డిగ్రీలు అదనంగా పెరగడంతో రాత్రిపూట చలి తీవ్రత తగ్గిందని తెలిపారు. రామగుండంలో ఆదివారం తెల్లవారుజామున 25 డిగ్రీలు నమోదయింది. శీతాకాలంలో రాత్రిపూట ఇంత ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవడం ఈ నెలలో ఇదే తొలిసారి. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు(rains in telangana) కురిశాయి. అత్యధికంగా వెంకటాపురం(ములుగు జిల్లా)లో 3.3, రవీంద్రనగర్‌(కుమురం భీం)లో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

తడిసి ముద్దైన కేరళ...

ఏకధాటి వర్షాలకు కేరళ తడిసిముద్దవుతోంది( heavy rain ). శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, పథనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి( heavy rain ). పలు ప్రాంతాల్లో రహదారులు నీటమునిగాయి. దక్షిణ కేరళలోని పలు చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి రైలు పట్టాలపై పడటంతో సర్వీసులకు అంతరాయం కల్గింది. రాబోయే 24 గంటల్లో మధ్య కేరళ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు( heavy rain ) కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదీ చదవండి: కేరళలో వరుణుడి ప్రతాపం- నీట మునిగిన ఇళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.