రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్, కామారెడ్డి, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం నాడు పశ్చిమ-వాయువ్య దిశగా కదిలిన వాయుగుండం మంగళవారం ఉదయం 8గంటల 30నిమిషాలకు విదర్భ పరిసర ప్రాంతాల్లో.... నాగపూర్‌కు నైరుతి దిశగా 250 కిలో మీటర్ల దూరంలో కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 6 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈ అల్పపీడనం 30వ తేదీ నుంచి అరేబియా సముద్రంలోని గుజరాత్ తీరంలో బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రోజు వాయువ్య పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించింది. అల్పపీడనంకు అనుబంధంగా ఉన్న అవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి మధ్యస్త ట్రోపో స్పీయర్ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 24గంటలలో మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: heavy rain in hyderabad: హైదరాబాద్- బెంగళూరు నేషనల్ హైవేపైకి వరద.. ట్రాఫిక్ ఆంక్షలు!