మధ్యప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తు నుంచి 1,500 మీటర్ల వరకు గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. ఇదే ప్రాంతం నుంచి మరఠ్వాడా, కర్ణాటకల మీదుగా కేరళ వద్ద సముద్రతీరం వరకు గాలుల అస్థిరతతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రంలోని 391 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా మునిగాలవీడు(మహబూబాబాద్ జిల్లా), నంగునూరు(సిద్దిపేట జిల్లా)లో 5.2 సెంటీమీటర్లు, తిరుమలాయపాలెం(ఖమ్మం జిల్లా)లో 4.8, ఖమ్మంలో 3.8, కేతెపల్లి(నల్గొండ)లో 4.7, కొమ్ములవంచ(మహబూబాబాద్)లో 4.3 టేకుమట్ల(సూర్యాపేట)లో 3.1 సెంటీమీటర్ల వర్షం పడింది.
ఇదీ చూడండి: హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం