ETV Bharat / state

నేడు తేలనున్న ఇంటర్​ ఫలితాల వివాదం - inter

ఇంటర్మీడియట్​ ఫలితాల వివాదానికి కేంద్ర బిందువైన గ్లోబరీనా​ టెక్నాలజీపై త్రిసభ్య కమిటీ విచారణకు సర్కారు విధించిన గడువు నేటితో ముగియనుంది. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాలు వంటి అన్ని కోణాల్లో విచారిస్తున్న కమిటీ నివేదికతో విద్యార్థుల భవిష్యత్​... నేడు ఓ కొలిక్కిరానుంది.

విద్యార్థుల భవితవ్యమేంటో
author img

By

Published : Apr 24, 2019, 6:08 AM IST

Updated : Apr 24, 2019, 12:28 PM IST

ఇంటర్మీడియట్​ ఫలితాలపై రోజు రోజుకి విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతూనే ఉంది. తమకు అన్యాయం జరిగిందని బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జవాబు పత్రాలు మళ్లీ పరిశీలించాలని సుమారు 14వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టు నిర్ణయం వెల్లడించే వరకు దరఖాస్తు గడువు పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.

విద్యార్థుల భవితవ్యమేంటో

నేటితో గడువు ముగింపు

ఇంటర్మీడియట్​ ఫలితాల వివాదానికి కేంద్రబిందువైన గ్లోబరీనా టెక్నాలజీస్​పై నిపుణుల కమిటీ విచారణకు సర్కారు విధించిన గడువు నేటితో ముగియనుంది. ఉన్నతాధికారులతో సమావేశమైన త్రిసభ్య కమిటీ.. దస్త్రాలు, ఒప్పందాలపై లోతైన విచారణ చేపట్టింది. టెండర్ల ప్రక్రియ, మార్కుల అప్​లోడ్, ఉపయోగించిన సాఫ్ట్​వేర్ డిజైన్, పనిచేసిన సిబ్బంది విద్యార్హతలు, అనుభవం, తదితర వివరాలు తెలుసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేసి గడువులోగా నివేదిక సమర్పిస్తామని కమిటీ ఛైర్మన్​ వెంకటేశ్వరరావు తెలిపారు.

బోర్డుదే బాధ్యత

ఇంటర్​ ఫలితాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కారణాలెన్ని చెప్పినా... బోర్డు బాధ్యత వహించాల్సిందేనన్న డిమాండ్​ వినిపిస్తోంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి తప్పుడు ఫలితాలే కారణమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ జవాబు పత్రాలు మళ్లీ పరిశీలించాలంటూ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఇప్పటికీ సాంకేతిక లోపాలు వెంటాడుతున్నాయి. ఆన్​లైన్​లో ఫీజు చెల్లించే గేట్​వే తెరవక విద్యార్థుల్లో అసహనం పెరుగుతోంది.

గడువు పెంచాలి

సాంకేతిక సమస్యలు, దరఖాస్తుల ఒత్తిడితో రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్​, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 27 వరకు పొడిగించారు. ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాలన్నీ పునఃమూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించగా... సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని హైకోర్టు నిర్ణయం వెల్లడించే వరకూ పొడిగించాలని విద్యార్థులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి : మూడురోజుల్లో 'ఇంటర్'​ నివేదిక

Last Updated : Apr 24, 2019, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.