ETV Bharat / state

ఇవాళ గవర్నర్​గా ప్రమాణం చేయనున్న తమిళిసై

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత రెండో గవర్నర్​గా తమిళిసై సౌందర​రాజన్​ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్​భవన్​లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​.ఎస్​.చౌహాన్​ ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్​, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం కూడా కార్యక్రమానికి హాజరుకానున్నారు.

నూతన గవర్నర్​
author img

By

Published : Sep 8, 2019, 5:48 AM IST

Updated : Sep 8, 2019, 8:43 AM IST

రాష్ట్ర నూతన గవర్నర్​గా తమిళిసై సౌందర​రాజన్​ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​.ఎస్​.చౌహాన్​ ఆమెతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత తమిళిసై సౌందర్​రాజన్​ రెండో గవర్నర్​ కావడం విశేషం.

షెడ్యూలు ఇలా...

రాష్ట్ర గవర్నర్​గా నియమితులైన తమిళిసై సౌందర్​రాజన్​ చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 8 గంటల 50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు తమిళిసైకి స్వాగతం పలుకుతారు. అనంతరం రాజ్​భవన్​కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​.ఎస్​.చౌహాన్...​ తమిళిసై సౌందరరాజన్​ ఆమెతో ప్రమాణం చేయిస్తారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా తమిళిసై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాజ్​భవన్​లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమం జరిగే సమయంలో రాజ్​భవన్​ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్​ ఆంక్షలు అమలు చేయనున్నారు.

ఇవాళ నూతన గవర్నర్​గా ప్రమాణం చేయనున్న తమిళిసై

ఇదీ చూడండి : రేపు మంత్రివర్గ విస్తరణ.. కేటీఆర్​, హరీశ్​కు బెర్త్ ఖాయం!

Intro:ఆసుపత్రి సమస్యలపై బైట్స్

blue shirt: sudhakar

black shirt: ramurthy

Body:ఆసుపత్రి సమస్యలపై బైట్స్

Conclusion:ఆసుపత్రి సమస్యలపై బైట్స్
Last Updated : Sep 8, 2019, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.