రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఇవాళ సమావేశం కానుంది. రైతుల రుణమాఫీ విషయంపై చర్చించేందుకు ఎస్.ఎల్.బీ.సీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్థిక, వ్యవసాయ శాఖ మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు బ్యాంకు అధికారులతో భేటీ కానున్నారు. యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియను ఈ నెల 15 నుంచి నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల నిర్ణయించింది.
దీంతో ఆరు లక్షలకు పైగా రైతులకు లబ్ది కలుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో రుణమాఫీ నిధుల విడుదల, రైతుల ఖాతాలో జమ సంబంధిత అంశాలపై బ్యాంకర్లతో ప్రభుత్వం ఇవాళ చర్చించనుంది.
ఇదీ చూడండి: HYDERABAD DRINAGE SYSTEM: రూ.కోట్లు పెట్టి.. ప్రాణాలకు సమాధి కట్టి!