Rain In hyderabad: వరుణుడు భాగ్యనగర వాసులపై మరోసారి ప్రతాపం చూపించాడు. జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో 2 గంటలుగా ఎడతెరపిలేని కురిసిన భారీ వర్షంతో.. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, తుర్కయాంజాల్, పెద్ద అంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, చైతన్యపురి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట, కొత్తపేట, కర్మన్‌ఘాట్, సంతోష్ నగర్, చాదర్‌ఘాట్, గోల్నాక, కాచిగూడ, నల్లకుంట, విద్యానగర్, ఓయూ క్యాంపస్, తార్నాక, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌లో వర్షం దంచికొట్టింది.
కోఠి, బేగంబజార్, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణ గూడ, హిమాయత్ నగర్లలో... అర గంట నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించాయి. ఎడతెరిపిలేని వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్, ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసింది.
పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. రహదారులపై నీరు పొంగిపొర్లడంతో పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులపాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇదీ చూడండి: రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్..!