ETV Bharat / state

ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల నూతన క్వార్టర్స్​ నేడే ప్రారంభం

రాష్ట్రంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం నిర్మించిన నూతన నివాస భవనాలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్​, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించనున్నారు. ఉదయం 11గంటలకు ఎమ్మెల్యేల గృహ సముదాయాలు ప్రారంభం కానున్నాయి.

నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్​ నేడే ప్రారంభం
author img

By

Published : Jun 17, 2019, 3:49 AM IST

Updated : Jun 17, 2019, 7:15 AM IST

నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్​ నేడే ప్రారంభం

హైదర్​గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహ సముదాయాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో వీటిని నిర్మించారు. ఇందులో మొత్తం 12 అంతస్తుల్లో 120 త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు నిర్మించారు.

నిర్మాణానికి రూ.166 కోట్ల వ్యయం

మొత్తం 4 ఎకరాల 26 గుంటల విస్తీర్ణంలో వీటిని నిర్మించారు. వీటితో పాటు 36 స్టాఫ్ క్వార్టర్స్, 120 అటెండర్ క్వార్టర్స్​ను ఇదే ప్రాంగణంలో నిర్మించారు. రూ. 166 కోట్లు వీటి నిర్మాణానికి ప్రభుత్వం వెచ్చిచ్చింది.

సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న క్వార్టర్స్​

ఇక మూడు సెల్లార్స్, గ్రౌండ్ ఫ్లోర్​తో పాటు 12 అంతస్తుల్లో ఒకే భవనాన్ని నిర్మించారు. ప్రతి అంతస్తులో 10 ఫ్లాట్లు ఉన్నాయి. మూడు సెల్లార్స్ లో 276 కార్లను పార్కింగ్ చేసకునే అవకాశం ఉంది. విజిటర్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్స్​లో 23 క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 8 లిఫ్ట్​లు ఏర్పాటు చేశారు. అధునాతన హంగులతో నిర్మించిన ఈ క్వార్టర్స్​లో నీటిని వృథా కాకుండా రీసైకిల్ చేసే విధానం కూడా ఉంది. శుద్ధి చేసిన నీటిని గార్డెన్​లోని చెట్లను పెంచడానికి వినియోగిస్తారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కోసం ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్, 320 కేవీఏ గల డీజిల్ జనరేటర్​ను ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి: నేడు విజయవాడ వెళ్లనున్న సీఎం కేసీఆర్​

sample description
Last Updated : Jun 17, 2019, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.