మున్సిపల్ ఎన్నికలపై నేడు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. ముందస్తు ప్రక్రియపై అభ్యంతరాలుంటే వారం రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించి... పది రోజుల్లో పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తామని న్యాయస్థానం తెలిపింది. పిటిషనర్లు అంగీకరిస్తే నేడు ఉత్తర్వులు వెల్లడిస్తామని ధర్మాసనం పేర్కొంది. అభ్యంతరాలు లేని వారి పిటిషన్లు కొట్టేసి మిగిలిన వారివి ప్రత్యేకంగా విచారిస్తామని కోర్టు తెలిపింది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం వార్డుల పునర్విభజన, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్ధంగా జరగలేదంటూ హైకోర్టులో 74 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిలో 67 మున్సిపాల్టీల్లో ఎన్నికలపై స్టే కొనసాగుతోంది. పిటిషనర్ల అభ్యంతరాలన్నీ.... పరిగణనలోకి తీసుకొని పరిష్కరించామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. అవసరమైతే తుది నోటిఫికేషన్ను పక్కన పెడతామని చెప్పారు. ఈ మేరకు అంగీకారం తెలిపిన పిటిషన్లు కొట్టేస్తూ నేడు హైకోర్టు ఉత్తర్వులు వెలువరించనుంది.
ఇదీ చూడండి : 'తెలంగాణలో ఎందుకు పుట్టానురా అనిపిస్తోంది