గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 67 మందికి కొవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులతో కొవిడ్ బారినపడ్డ వారి సంఖ్య 8,89,077కి చేరిందని వెల్లడించింది. తాజాగా.. కరోనా కారణంగా ఒకరు మృతి చెందగా... మహమ్మారి ప్రభావంతో ఇప్పటివరకు 7,166 మంది మృతి చెందినట్లు వివరించింది.
మరోవైపు.. గడిచిన 24 గంటల్లో 54 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మెుత్తం కోలుకున్నవారి సంఖ్య 8,81,292 కు చేరింది. ఇప్పటివరకు ఏపీలో కోటి 36 లక్షల 44 వేల 086 కరోనా నిర్ధరణ పరీక్షలు చేసినట్లుగా తాజా బులెటిన్లో వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఇండియా సైకిల్ ఫర్ ఛేంజ్ ఛాలెంజ్లో రాష్ట్రం నుంచి 2 నగరాలు