విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆసుపత్రికి వచ్చి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మొదటి నుంచి రవళి ఆరోగ్యం విషమంగానే ఉందని చెప్పారు. రాష్ర్టంలో మరే ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకుండా నిందితుడైన సాయి అన్వేష్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తరఫున కుటుంబానికి అండగా నిలబడతామని వెల్లడించారు.
కేసు దర్యాప్తు కోసం వరంగల్ పోలీసులు గాంధీకి చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం రవళి మృతదేహాన్ని వరంగల్ జిల్లా రామచంద్రపురం గ్రామానికి తరలించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి:మృత్యువుతో పోరాడి..!