ETV Bharat / state

RAINS: రాష్ట్రంలో ఇవాళ, రేపు పలుచోట్ల భారీ వర్షాలు! - వాతావరణ శాఖ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా... రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. నగరాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ పలుచోట్ల వాగులు పొంగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండడంతో ఇవాళ, రేపు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

rains alert in telangana
అతిభారీ వర్షాలు
author img

By

Published : Jul 13, 2021, 7:10 AM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు పడగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో అత్యధికంగా 13 సెంటీమీటర్లు కురిసినట్లు వాతావరణశాఖ పేర్కొంది. బంగాళఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ద్రోణి ఉత్తరాంధ్ర మీదుగా గుజరాత్​లోని కచ్​ ప్రాంతం వరకూ వ్యాపించింది. ఈ క్రమంలో ఇవాళ, రేపు పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

నగరంలో రోడ్లు జలమయం

సోమవారం హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్, లిబర్టీ, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, తదితర చోట్ల వర్షం కురిసింది. ముషీరాబాద్‌, కవాడిగూడ, రాంనగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, జవహర్‌నగర్‌, గాంధీనగర్‌, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. వివిధ పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే వాహనదారులు, బాటసారులు.... వర్షం ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతూ గమ్యస్థానాలకు చేరుకున్నారు. రోడ్లపై భారీగా నీరు చేరడంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదలటం వల్ల రోడ్లు రద్దీగా మారాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లడంతోపాటు... విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.

జిల్లాల్లోనూ అదే పరిస్థితి

జిల్లాల్లోనూ పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. భద్రాద్రి జిల్లా మణుగూరు మండలం కొండాపూర్‌కు చెందిన కుటుంబం.. సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం మేడారం వచ్చారు. జంపన్న వాగులో స్నానం చేస్తుండగా... ప్రమాదవశాత్తు శ్యామరావు, కోటేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ములుగు జిల్లా కేశవాపూర్‌లో తిరుపతి అనే రైతు పత్తిచేనులో మందు చల్లుతుండగా వర్షం పెరిగింది. పక్కనే ఉన్న చెట్టుకిందకు వెళ్లడంతో.. పిడుగు పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. భద్రాద్రి జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఇటీవల వర్షాలకు కిన్నెరసాని వాగు జోరుగా ప్రవహిస్తుంది. మోదుగుల గూడెం సజ్జల బోడు గ్రామాల మధ్య మూడేళ్ల క్రితం ప్రతిపాదించిన వంతెన నిర్మాణం పూర్తికాకపోవడంతో నాలుగు గ్రామాల ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ఈ గ్రామాల మధ్య ప్రయాణం చేసేందుకు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు ఆదివాసీలు వాగు దాటాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మహిళలు, వృద్ధులు ప్రాణాలు పణంగా పెట్టి వాగు దాటుతున్నారు. అదుపు తప్పితే వాగు ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశముంది.

ఇదీ చూడండి: RAINS: భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.