ETV Bharat / state

'వైరస్​ను జయించాలంటే శారీరకంగానూ ధృడంగా ఉండాలి' - గోషామహల్​ ఎమ్మెల్యే తాజా వ్యాఖ్యలు

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు మానసిక, శారీరక ధృడత్వం చాలా అవసరమని తెలిపారు గోషామహల్​ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​. అందుకోసం ప్రతి ఒక్కరూ పౌష్టికాహారంతో పాటు విధిగా వ్యాయామం చేయాలని సూచించారు.

To overcome the virus, must be physically strong our self said by Goshmahal MLA RajaSingh
'వైరస్​ను జయించాలంటే శారీరకంగానూ ధృడంగా ఉండాలి'
author img

By

Published : Jun 20, 2020, 1:01 PM IST

Updated : Jun 20, 2020, 1:07 PM IST

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారికి పేద, ధనిక భేదమనేది లేదని... ప్రతి ఒక్కరు దానితో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని భాజపా శాసన సభాపక్ష నేత, గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు​. కరోనాను జయించాలంటే ప్రతి ఒక్కరూ మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలన్నారు. ఇందు కోసం ఆయన వ్యాయామం చేస్తూ... అందరూ ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ సోకినా దానిని ఓడించే శక్తి మనదగ్గర ఉండాలని... అందుకోసం పౌష్టికాహారంతో పాటు వ్యాయామం తప్పనిసరని సూచించారు. ప్రతి ఒక్కరు విధిగా తమ తమ కార్యకలాపాలలో భాగంగా భౌతిక దూరం పాటించాలని కోరారు.

ఇదీ చూడండి : నేడు భాజపా వర్చువల్​ ర్యాలీ

Last Updated : Jun 20, 2020, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.